డిఎస్పీగా నియామకమైన పరుగుల చిరుత హిమదాస్..

భారత దేశం గర్వించదక్క వారిలో హిమదాస్ కూడా ఒకరు.ఈమె ఒక స్టార్ అథ్లెట్, ఈమె పరుగుపెట్టిందంటే చాలు  చిరుత కూడా ఆమె వేగాన్ని దాటలేదేమో అనే అంతలా పరుగులు పెడుతుంది.

 Himadas A Running Leopard Was Appointed As Dsp-TeluguStop.com

అందుకే హిమదాస్ ను అందరు పరుగుల చిరుత అని అంటారు.కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఒక ఒక ఆడపిల్ల ఇంతటి ఘన విజయాలను సాదిస్తుందంటే అది నిజంగానే మన భారత మాత గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి.

అయితే హిమదాస్ ను  అసోం ప్రభుత్వం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పదవిని కట్టబెట్టింది.శుక్రవారం(ఫిబ్రవరి 26) జరిగిన ఓ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ హిమదాస్‌కు పదవికి సంబందించిన నియామక పత్రాలు కూడా అందచేశారు అనంతరం ఆ  రాష్ట్ర డీజీపీ భాస్కర్ జ్యోతి మహాత్మ స్వయంగా హిమదాస్‌ యూనిఫాంపై స్టార్లను తొడిగి శుభాకాంక్షలు తెలియజేశారు.

 Himadas A Running Leopard Was Appointed As Dsp-డిఎస్పీగా నియామకమైన పరుగుల చిరుత హిమదాస్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హిమదాస్  అసోంలోని నగావ్ జిల్లాలోని దింగ్ అనే ఒక చిన్న గ్రామంలో అత్యంత పేద కుటుంబంలో జన్మిచినది.  కాళ్లకు కనీసం వేసుకోవడానికి సరైన చెప్పులు కూడా లేని స్థితిలో బురద నేలలో వట్టి పాదాలతోనే హిమ చిరుతలాగా పరిగెత్తేవారు.స్కూల్ లో చదివే సమయంలో  అక్కడ పీఈటీ టీచర్ హిమదాస్ లోని  ప్రతిభను గుర్తించడంతో హిమదాస్ అథ్లెటిక్స్‌లోకి అడుగుపెట్టారు.2018లో ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో హిమదాస్  ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు.ఈఘనత సాధించిన భారత తొలిమహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu 2018 Year, Assam Police, Dsp, Olmplics, Police, Running Race-Latest News - Telugu

తన ప్రతిభను గుర్తించి అసోం ప్రభుత్వం  డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) గా హిమకు బాధ్యతలు అప్పగించడంతో  హిమదాస్ ఆనందాన్ని వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా ఆమె  మాట్లాడుతూ  తన చిన్ననాటి కల ఈరోజు నెరవేరిందన్నారు స్కూల్లో చదువుకునే రోజుల్లో నుండే పోలీస్ అధికారి కావాలన్న కోరిక ఉండేది.అలాగే నా తల్లి కూడా అదే కోరుకుంది.ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి క్రీడలే కారణం.కాబట్టి భవిష్యత్తులో అసోంను క్రీడా రంగంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తాను అని హిమదాస్ తెలిపారు.అలాగే అసోం పోలీస్ విభాగంలో కూడా బాధ్యతాయుతంగా పని చేస్తానని తెలిపింది.

తనకు ఈ గౌరవాన్ని,హోదాను ఇచ్చినందుకు ముఖ్యమంత్రి సోనోవాల్‌కు,అసోం ఒలింపిక్ కమిటీకి,డీజీపీ భాస్కర్ జ్యోతికి హిమదాస్ కృతజ్ఞతలు తెలిపారు.

#Olmplics #Assam Police #Running Race #2018 Year #Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు