హిల్లరీ సంచలన ప్రకటన...!!!  

Hillary Clinton Say She Is Not In American President Race-hillary Clinton,nri,telugu Nri News Updates,trump

  • అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపునుంచీ మళ్ళీ ట్రంప్ నామినేషన్ వేసి పోటీ లో ఉండాలని ముందునుంచీ వ్యూహాలు రచిస్తున్నాడు. అయితే డెమోక్రాటిక్ పార్టీ తరుపునుంచీ ఇప్పటికే భారత సంతతికి చెందిన కమలా హరీస్, తులసీ గబ్బార్డ్ పోటీ పడుతున్నారు.

  • Hillary Clinton Say She Is Not In American President Race-Hillary Nri Telugu Nri News Updates Trump

    Hillary Clinton Say She Is Not In American President Race

  • అయితే హిల్లరీ తన అభ్యర్ధిత్వాన్ని ఎప్పుడు ప్రకటిస్తారా అని వేచి చూస్తున్న తరుణంలో ఒక్క సారిగా ఆమె సంచలన ప్రకటన చేశారు. ఈ సారి తాను అధ్యక్ష రేసులో లేనని స్పష్టం చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయిన హిల్లరీ ఈ సారి పోటీ చేసే ఆలోచన లేదని చెప్పారు.

  • Hillary Clinton Say She Is Not In American President Race-Hillary Nri Telugu Nri News Updates Trump
  • తానూ పోటీలో లేకపోయినా సరే తను నమ్మిన సిద్దాంతాల కోసం పాటు పడతానని భరోసా ఇచ్చారు. తమ పార్టీ నుంచీ పోటీలు పడుతున్న వారితో మాట్లాడానని , అధ్యక్ష రేసులో ఈ సారి డెమోక్రాటిక్ పార్టీదే విజయమని అన్నారు. ట్రంప్ పై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందని విమర్శించారు.