ట్రంప్‌తో మళ్లీ పోటీకి సిద్దం  

Hillary Clinton Intresting Comments On Donald Trump-american President Donald Trump,hillary Clinton

వచ్చే ఏడాదిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్న విషయం తెల్సిందే.2016వ సంవత్సరంలో మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌ మరియు ట్రంప్‌లు హోరా హోరీ తలబడ్డారు.ఆ ఎన్నికల్లో హిల్లరీపై ట్రంప్‌ ఘన విజయాన్ని సాధించాడు.అమెరికాలో ఆయన చాలా సంస్కరణలు చేశాడు.అయితే కొన్నింటి వల్ల కొందరు బాధపడటంతో పాటు కొందరు ఇబ్బందులకు గురయ్యారు.

Hillary Clinton Intresting Comments On Donald Trump-american President Donald Trump,hillary Clinton Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు)- -Hillary Clinton Intresting Comments On Donald Trump-American President Trump

ఆ కారణంగానే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను తొలగించాలని చాలా మంది భావిస్తున్నారు.అందుకే ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేయబోతున్న వారు ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

2020వ సంవత్సరంలో జరుగబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ మళ్లీ పోటీ చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.ఇక ఆయన ప్రత్యర్థిగా హిల్లరీ క్లింటన్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెను చాలా మంది ఒత్తిడి చేస్తున్నట్లుగా కూడా ఆమె చెప్పుకొచ్చారు.ఇటీవల ఆమె బీబీసీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జనాలు నన్ను పోటీకి దిగాలని సూచిస్తున్నారు.నేను ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాను.

అయితే ఖచ్చితంగా భవిస్యత్తులో మంచి నిర్ణయాన్ని తీసుకుంటానంటూ హామీ ఇచ్చింది.