జియో కొత్త ఆఫర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

అనుకున్నట్లుగానే జియో తన వెల్కమ్ ఆఫర్ నిడివిని పెంచింది.ఉచిత 4G సర్వీసులు వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకు పొడిగిస్తున్నట్లు నిన్న ఆఫీషియల్ గా ప్రకటించింది.

 Highlights From The Jio New Welcome Offer-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఉన్న ఆఫర్లో చిన్ని మార్పులు చేసింది.అదేటంటే, జనవరి 1వ తేది నుంచి మీ మొబైల్ డేటా యొక్క FUP లిమిట్ రోజుకి 4GB నుంచి 1GB కి కుదించబడుతుంది.

అంటే, రోజుకి 1GB డేటా ఉచితంగా వాడుకోవచ్చు.

జియో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, 100% జియో యూజర్లు, రోజుకి 1GB దరిదాపుల్లోనే డేటా ని ఉపయోగిస్తున్నారట.

కేవలం 20% మంది మాత్రమే, 2-4GB దాకా వెళుతున్నారట.ఇక కాల్స్ లో, ఎస్సెమ్మెస్ లో ఎలాంటి మార్పు లేదు.

ఈ సర్వీసులు ప్రస్తుతం ఉన్న ఆఫర్లో లానే, ఉచితంగా, కాల్స్ పై ఎలాంటి లిమిట్ లేకుండా ఉంటాయి.ఇప్పుడే కాదు, జియో వాయిస్ కాల్స్ ఎప్పటికి ఉచితంగానే అందుబాటులో ఉంటాయని, గతంతో పోలిస్తే, ఇప్పుడు కాల్స్ డ్రాప్ సమస్య చాలావరకు తగ్గిందని, ఉన్న సమస్యలు, ఇతర ఆపరేటర్ల సహకారం లేకపోడం వలనే అని అంబాని తెలిపారు.

అలాగే జియో 50 మిలియన్ల వినియోగదారులను చేర్చుకుందని ఆ సంస్థ ప్రకటించింది.మొదటి మూడు నెలలతో పోలిస్తే, ఫేస్ బుక్, వాట్సాప్, స్కైప్ కన్న జియో ఎక్కువ విజయవంతం అయ్యిందని రిపోర్టు.

ఇక జియో eKYC సెంటర్లు దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉంటాయని, అలాగే జీయో సిమ్ డోర్ డెలివరీ సర్వీస్ కూడా మొదలయినట్లు అంబాని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube