'అకౌంట్ నెంబర్ చెప్పు...లక్ష రూపాయలు ఇస్తాను' అని 'వర్మ' అంటే...అతని రిప్లై హైలైట్.!     2018-10-15   10:02:54  IST  Sai Mallula

ఏపీ ముఖ్యమంత్రి పోలికలతో ఉన్న ఓవ్యక్తికి సంబంధించిన వీడియో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నిజం చెప్పాలంటే ఆ వ్యక్తి కూడా అచ్చం చంద్రబాబు నాయుడుగారి లానే ఉన్నాడు. అందుకే వీడియో అంతలా వైరల్ అయింది. ఓ హోటల్ లో సర్వింగ్ చేస్తూ ఉన్న ఈ వీడియోను ఎవరు సోషల్ మీడియాలో పెట్టారో తెలియదు కానీ తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో రామ్ గోపాల్ వర్మ కంట్లో పడింది.

Highlight Counter To RGV From Rohioth-

Highlight Counter To RGV From Rohioth

సదరు వ్యక్తి ఆచూకీని కనుక్కోవడంలో సహకరించినవారికి రూ.లక్ష అందజేస్తానని శనివారం ఫేస్‌బుక్‌లో ప్రకటన చేశారు వర్మ. ఓ న్యూస్‌ చానల్‌లో పనిచేసే ముత్యాల రోహిత్‌ చంద్రబాబును పోలిన వెయిటర్‌ ఆచూకీని ఆర్జీవీకి పంపారు. ఈ విషయాన్ని శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఆర్జీవీ ఫేస్‌బుక్‌ ద్వారా ధ్రువీకరించారు. ‘‘హే రోహిత్, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా యూనిట్‌కు సీబీఎన్‌(చంద్రబాబు)ను బహుకరించినందుకు కృతజ్ఞతలు. సినిమా ప్రారంభంలో తెరపైకి నీ పేరు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నీ బ్యాంకు ఖాతా నంబర్‌ పంపించు లక్ష రూపాయల బహుమతి కోసం..’’అని ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

Highlight Counter To RGV From Rohioth-

ఈ వీడియో కోసం క్లిక్ చేయండి

అయితే రోహిత్ మాత్రం “నేను డబ్బు కోసం చేయలేదు…మీరు ఇవ్వాలనుకున్న లక్ష రూపాయలను కొండగట్టు బస్సు ప్రమాదంలో నష్టపోయిన నాలుగు కుటుంబాలకు ఇవ్వండి” అని అన్నాడు.

ఈ కన్వెర్జేషన్ కోసం క్లిక్ చేయండి