ఐపీఎల్ లో ఈ ఆటగాళ్ల సంపాదన 100 కోట్లు పైనే , అత్యధికంగా సంపాదించిన ఆటగాడు ఎవరో తెలిస్తే షాక్ !

ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కానీ దీన్ని ఫైనాన్సిల్ టర్మ్ లో చెప్పాలంటే ఇండియన్ పైసా లీగ్ చెప్పొచ్చు.ఈ లీగ్ ఆడితే చాలు డబ్బే డబ్బు అనుకునే ఆటగాళ్లు కూడా ఉన్నారు.

 Highest Salaried Players In Ipl Till Date-TeluguStop.com

కొంత మంది విదేశీ ఆటగాళ్లు అయితే సొంత దేశ మ్యాచ్ లకన్న ఐపీఎల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు డబ్బు ఎంతలా ఈ లీగ్ లో పెడతారో అని.అలా ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ అన్నింటిలో కలిపి అత్యధికంగా 100 కోట్లకు పైగా వేతనం ఆర్జించిన ఆటగాళ్లు ఎవరో చూడండి.

1.మహీంద్రసింగ్ ధోని ( చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ )


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బలమైన జట్టు , ఆడిన ప్రతి ఐపీఎల్ లో సెమీస్ వెళ్లిన జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్‌ కింగ్సే దానికి ముఖ్య కారణం కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్‌ ధోనీయే కారణమంటే అతిశయోక్తి కాదేమో! ధనాధన్‌ సిక్సర్లతో, హెలికాప్టర్‌ షాట్లతో అభిమానులను అలరించాడు.తన అద్భుత కెప్టెన్సీతో ఓడిపోయే మ్యాచ్‌లెన్నిటినో మలుపు తిప్పాడు.చెన్నైని మూడు సార్లు విజేతగా నిలిపాడు.

అంతేనా ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న ఎంతోమంది క్రికెటర్లను మళ్లీ జోరందుకొనేలా చేశాడు.ఐపీఎల్‌ ద్వారా ధోనీ ఇప్పటి వరకు సంపాదించిన మొత్తం ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు , 12 సీజన్లతో కలిపి రూ.122.84 కోట్లు ఆర్జించాడు.2008-10 వరకు సీజన్‌కు రూ.6 కోట్లు అందుకున్నాడు.2011-13 వరకు రూ.8.28 కోట్లు, 2014-17 వరకు రూ.12.5 కోట్లు తీసుకున్నాడు.ఇక 2018 నుంచి రూ.15 కోట్లు తీయకుంటున్నాడు.మొత్తం ఐపీఎల్ ఆదాయం 120 కోట్ల పైనే.

2.రోహిత్ శర్మ ( ముంబై ఇండియన్స్ కెప్టెన్ )

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ తన కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ కి ఎన్నో విజయాలు మరియు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన సారథి రోహిత్‌ శర్మ.తను క్రీజులో ఉంటే స్టేడియం లో సిక్సర్ల మోతే , తనదైన శైలిలో సొగసైన సిక్సర్లు బాది అభిమానులను అలరిస్తాడు.తొలి మూడు సీజన్ల వరకు దక్కన్‌ ఛార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత ఐపీఎల్ వేలం లో ముంబై రోహిత్ ని తీసుకుంది.ఐపీఎల్ లీగ్‌లో హిట్‌మ్యాన్‌ ఆర్జించిన మొత్తం రూ.116.60 కోట్లు.తొలి మూడు సీజన్లకు రూ.3 కోట్లు, 2011-13 వరకు రూ.9.20 కోట్లు, 2014-17 వరకు రూ.12.5 కోట్లు తీసుకున్నాడు.2018 నుంచి రూ.15 కోట్లు అందుకుంటున్నాడు.

3.విరాట్ కోహ్లీ – ( రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ )

ఇప్పటి వరకు ఫ్రాంచైజీ మారని ఆటగాడు విరాట్‌ కోహ్లీ.రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును విజేతగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు.

క్రిస్‌గేల్‌, డివిలియర్స్‌ వంటి విధ్వంసకారులు జట్టులో ఉన్నా అతడి కల నెరవేరలేదు.పరుగుల వరదతో బెంగళూరు అభిమానులను అలరిస్తున్నాడు.2008లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిపించిన విరాట్‌కు తొలి మూడు సీజన్లకు కలిపి రాయల్‌ ఛాలెంజర్స్‌ చెల్లించింది రూ.1.2 కోట్లే.తన పరుగుల దాహంతో ఆ ధరను రూ.8.28 కోట్లకు పెంచుకున్నాడు.2013 వరకు ఆ మొత్తం అందుకున్నాడు.ఆ తర్వాత సీనియర్ల కోటాలోకి వెళ్లి 2014-17 వరకు రూ.12.50 కోట్లు తీసుకున్నాడు.2018 నుంచి అందర్నీ మించి ఏకంగా రూ.17 కోట్లు అందుకుంటున్నాడు.మొదటి మూడు సీజన్లలో ఎక్కువ మొత్తం తీసుకొని ఉంటే ధోనీని మించేవాడే.ఇంతకు విరాట్‌ ఆర్జన ఎంతంటే రూ.109.20 కోట్లు.ఇంకా రాబోయే కాలంలో ఐపీఎల్ లో అత్యధిక ఆదాయం పొందే ఆటగాళ్లలో నెంబర్ 1 కి చేరవచ్చు.

4.సురేష్ రైనా ( చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు )

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్ వచ్చిందంటే చాలు పరుగుల వరద పారిస్తాడు అందుకే సురేష్ రైనాని మిస్టర్ ఐపీఎల్ అని పిలుస్తారు ఇతఙ ఏకంగా 4,985 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.అతడి సగటు, స్ట్రైక్‌రేట్‌ సైతం తక్కువేమీ కాదు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాల్లో రైనా పాత్ర అత్యంత కీలకం.ప్రత్యర్థి ఎవరో చూడకుండా బ్యాటింగ్‌ చేస్తాడు.

రెండేళ్లుగా టీమిండియాలో లేకపోవడంతో అతడి ప్రాముఖ్యం కాస్త తగ్గింది.తొలి మూడు సీజన్లకు రైనా రూ.2.6 కోట్లు తీసుకోగా 2011-13 వరకు రూ.5.98 కోట్లు అందుకున్నాడు.2014-16 వరకు రూ.9.5 కోట్లు పుచ్చుకున్నాడు.2017లో రూ.12.5 కోట్లు అత్యధికంగా తీసుకున్నాడు.2018 నుంచి రూ.11.0 కోట్లు అందుకుంటున్నాడు.చెన్నైపై నిషేధం విధించడంతో తొమ్మిది, పదో సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే.

ఇతని ఐపీఎల్ ఆదాయం 100 కోట్ల పై మాటే.

5.యువరాజ్ సింగ్ ( ముంబై ఇండియన్స్ ఆటగాడు )

ఐపీఎల్ ప్రారంభం కాకముందే 2007 లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆరు బంతులకి ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించిన ఆటగాడు యువరాజ్ సింగ్.ఇతడు క్రీజులో ఉంటే సిక్సర్ల్స్తో స్టేడియం హోరెత్తుతుంది.

గత కొన్ని ఐపీఎల్ ల నుండి సరిగ్గా రాణించని యువరాజ్ ని ఈ సీజన్ కోసం ఎవరు తీసుకోడానికి ఇష్టపడలేదు ముంబై జట్టు ఈ ఆటగాడిని సొంతం చేసుకుంది.తొలి మూడు సీజన్లకు కింగ్స్‌ ఎలెవన్‌ తరఫున రూ.4.25 కోట్లు తీసుకున్నాడు.2011 నుంచి 13 వరకు పుణె వారియర్స్‌ నుంచి రూ.8.2 కోట్లు అందుకున్నాడు.2014లో బెంగళూరు రూ.14 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.

ఇక 2015లో దిల్లీ ఏకంగా రూ.16 కోట్లకు వేలంలో దక్కించుకుంది.2016, 2017లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి రూ.7 కోట్లు తీసుకున్నాడు.2018లో పంజాబ్‌ కనీస ధర రూ.2 కోట్లు చెల్లించింది.ఈ సారి ముంబయి అతడిని కోటి రూపాయలకే దక్కించుకుంది.మొత్తంగా అతడి సంపాదన రూ.84.60 కోట్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube