చరణ్‌ కంటే ఎన్టీఆర్‌కు తక్కువ.. అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్‌     2018-07-19   12:09:27  IST  Ramesh Palla

తెలుగులో ప్రస్తుతం రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు నువ్వా నేనా అన్నట్లుగా స్టార్‌ ఇమేజ్‌తో దూసుకు పోతున్నారు. వీరిద్దరు చేస్తున్న సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు దక్కించుకోవడంతో పాటు భారీ ఓపెనింగ్స్‌ దక్కుతున్నాయి. సినిమాల సంఖ్య తక్కువే అయినా కూడా రామ్‌ చరణ్‌ సాధించిన వసూళ్లు ఎక్కువ అంటూ మెగా ఫ్యాన్స్‌ చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా చేసిన రంగస్థలం చిత్రం ఏకంగా 125 కోట్ల షేర్‌ను రాబట్టి బాహుబలి తర్వాత స్థానంలో నిలిచింది. ఇక ఎన్టీఆర్‌ వంద కోట్లను కూడా ఇప్పటి వరకు రాబట్టలేక పోయాడు అనేది కొందరి వాదన. ఇక ఈ సమయంలోనే వీరిద్దరు వేరు వేరుగా మొబైల్‌ సేల్స్‌ షోరూమ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా ఎంపిక అయ్యారు.

చరణ్‌ తాజాగా హ్యాపీ మొబైల్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక కాగా, ఎన్టీఆర్‌ సెలెక్ట్‌ మొబైల్‌ స్టోర్స్‌కు అంబాసిడర్‌గా ఎంపిక అవ్వడం జరిగింది. ఇక హ్యాపీ మొబైల్స్‌ కోసం ప్రచారం చేయబోతున్నందుకు రామ్‌ చరణ్‌ సంవత్సరంకు రెండు కోట్ల చొప్పున మూడు సంవత్సరాల పాటు అగ్రిమెంట్‌ చేసుకోవడం జరిగింది. అయితే ఎన్టీఆర్‌కు మాత్రం సెలక్ట్‌ కంపెనీ కేవలం 1.5 కోట్లు చొప్పున మూడు సంవత్సరాల అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లుగా సమాచారం అందుతుంది. చరణ్‌ ఎందుకు ఇంత తక్కువ పారితోషికానికి ఒప్పుకున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Highest Remuneration For Ram Charan Mobile Ads-

Highest Remuneration For Ram Charan For Mobile Ads

రామ్‌ చరణ్‌ కంటే ఎన్టీఆర్‌కు పారితోషికం తక్కువ ఇవ్వడం ఏంటీ అంటూ సదరు సంస్థపై నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్‌ కంటే రామ్‌ చరణ్‌ ఏ విషయంలో ఎక్కువ అని ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా ఫ్యాన్స్‌ మాత్రం తమ హీరో ముందు ఎన్టీఆర్‌ తక్కువే అన్నట్లుగా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ ఒక వైపు గొడవ పడుతుండగా జక్కన్న దర్శకత్వంలో వీరు మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి భారీ బడ్జెట్‌తో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నాడు. రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేసిన బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా అవ్వడంతో మల్టీస్టారర్‌పై అందరు అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌, చరణ్‌ల ఫ్యాన్స్‌ మద్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా జక్కన్న మల్టీస్టారర్‌ కోసం అంతా ఏకం అవుతారని అంతా ఆశిస్తున్నారు.