తెలంగాణలో ఖమ్మం టాప్‌

ఖమ్మం టాప్‌ రేంజ్‌లో ఉంది.ఎందులో? పరీక్షల ఫలితాల్లోనా? అభివృద్ధి పనుల్లోనా? ఈ రికార్డు ఎందులో? మండుతున్న ఎండల్లో ఈ రికార్డు నెలకొల్పింది.శనివారం రాష్ర్టం మొత్తం మీద ఖమ్మంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది.నలబై ఎనిమిది డిగ్రీల సెల్సీయస్‌కు చేరుకుంది.రాష్ర్టంలో ఇదే టాప్‌.ఖమ్మంలో అరవై ఎనిమిది సంవత్సరాల తరువాత రికార్డుస్థాయిలో ఉంతటి ఉష్ణోగ్రత నమోదైంది.

 Khammam The Highest Temperature In The State-TeluguStop.com

ఖమ్మం నగరంలో పందొమ్మది వందల నలభై ఏడో సంవత్సరంలో నలభై రెండు పాయింట్‌ రెండు డిగ్రీల సెలిఈ్సయస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.మళ్లీ ఇప్పుడు ఆ స్థాయికి చేరుకుంది.

రెండు తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటివరకు వందలాదిమంది చనిపోయారు.ఇంత ఎండలు ఎందుకున్నాయి? ఎందుకు ప్రాణాలు తీసుకున్నాయి? అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు.కొందరు దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం సాయం చేయాలని కూడా కోరుతున్నారు.ఎండలు ఇంత తీవ్రంగా ఉండటానికి, సూర్యుడు చండ ప్రచడంగా నిప్పులు కురిపించడానికి మనుషులు చేస్తున్న విధ్వంసమే కారణమని పర్యావరణ శాస్ర్తవేత్తలు, ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.

మనం చెరువులను కబ్జా చేశాం, అడవులను నరికేశాం.గుట్టలను కొల్లగొట్టాం.ప్రకృతిని ఎంత నాశనం చేయాలో అంతా నాశనం చేస్తున్నాం.అపరిమితమైన కాలుష్యాలను గాల్లోకి వదులుతున్నాం.

గాలి, నీరు, భూమి, , ఆకాశం పూర్తిగా కలుషితమాయ్యయి.మరి ప్రకృతి మాత్రం ఏం చేస్తుంది? దాని కోపాన్ని ఏదో ఒక రూపంలో తీర్చుకోవాలి కదా.ఎంండల రూపంలో, వానలో రూపంలో, చలి రూపంలోతీర్చుకుంటుంది.అయినా మనిషిలో మార్పు రాడంలేదు.

అదే విచిత్రం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube