ఐపీఎల్ లో ఆ బౌలర్ విలువ 71 కోట్లు , ఇంతకి ఆ బౌలర్ ఎవరో మీకు తెలుసా?  

Highest Earning Bowlers In The Indian Premier League-

ఐపీఎల్ టీ 20 అంటేనే బౌలర్ల కన్నా ఎక్కువ బ్యాట్స్ మెన్ గురించే మాట్లాడుకుంటారు , ఐపీఎల్ వేలంలో లో కూడా ఎక్కువ బ్యాట్స్ మెన్ లకే ఎక్కువ మొత్తం లో డబ్బు వెచ్చిస్తుంటారు .కానీ ఐపీఎల్ లో కూడా కొంతమంది బౌలర్లకు మంచి డిమాండ్ ఉంది దానితో ఐపీఎల్ ఫ్రాంచైజీ లు ఆ ఆటగాళ్ల పైన ఎక్కువ మొత్తం లో డబ్బు పెడుతుంది .ఇప్పటికి వరకు జరిగిన ఐపీఎల్ మొత్తంలో అన్ని సీజన్లను కలిపి ఎక్కువ ఆదాయం పొందిన బౌలర్లు ఎవరో చూడండి.

Highest Earning Bowlers In The Indian Premier League-

10.ఆశిష్ నెహ్రా – 32 కోట్లు

మాజీ ఇండియన్ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్ లో మొత్తం 88 మ్యాచ్ లు ఆడి 105 వికెట్లు తీసుకున్నాడు .ఇతను ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , పుణె వారియర్స్ , సన్ రైజర్స్ తరుపున ఆడాడు.

Highest Earning Bowlers In The Indian Premier League-

ఈ ఆటగాడు తన ఐపీఎల్ కెరీర్ మొత్తం లో 32 కోట్లు పారితోషికం రూపం లో పొందాడు.

9.జహీర్ ఖాన్ – 33 కోట్లు

టీం ఇండియా 2011 లో వరల్డ్ కప్ గెలవడం లో ముఖ్య పాత్ర పోషించి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జహీర్ ఖాన్ , ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ , ముంబై ఇండియన్స్ , ద్వెల్లీ డేర్ డెవిల్స్ తరుపున ఆడాడు.మొత్తం ఐపీఎల్ లో 100 మాచ్ లు ఆది 102 వికెట్ లు తీసుకున్నాడు , అతను ఇప్పటిదాకా 33 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు.

8.భువనేశ్వర్ కుమార్ – 35 కోట్లు

స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో బెంగళూర్ , పుణె మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు .

102 మ్యాచ్ లలో 120 వికెట్లు పడగొట్టిన భువి తన ఐపీఎల్ కెరీర్ లో 35 కోట్లు ఆర్జించాడు.

7.పియూష్ చావ్లా- 43 కోట్లు

ఈ లెగ్ స్పిన్నర్ మొదటి 6 సీజన్ల పంజాబ్ తరుపున ఆడగా తరువాత సీజన్ నుండి కోల్ కత్తా కి అడుతున్నాడు , పియూష్ 144 మ్యాచ్ లలో 140 వికెట్ లు తీసాడు.ఇతను ఐపీఎల్ కెరీర్ మొత్తం లో 43 కోట్ల ఆదాయం సంపాదించాడు.

6.ఇర్ఫాన్ పఠాన్ – 44 కోట్లు

ఇర్ఫాన్ పఠాన్ ఒకప్పుడు ఇండియా తరుపున ఆడి సంచనాలు సృష్టించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దాదాపు ఐపీఎల్ లో ఆరు జట్లకి ప్రాతినిథ్యం వహించాడు.

ఇతను 103 మ్యాచ్ లు ఆడగా 80 వికెట్ లు తీసాడు.ఇతని ఐపీఎల్ ఆదాయం 45 కోట్లు.

5.డేల్ స్టెయిన్ – 45 కోట్లు

సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ స్టెయిన్ ఐపీఎల్ లో బెంగళూర్ , డెక్కన్ ఛార్జర్స్ , సన్ రైజర్స్ తరుపున ఆడి మొత్తంగా 90 మ్యాచ్ లలో 92 వికెట్లు తీసాడు.

ఇతని మొత్తం ఐపీఎల్ ఆదాయం 45 కోట్లు.

4.లసిత్ మలింగ – 48 కోట్లు

మొదటి ఐపీఎల్ నుండి ఇప్పటి వరకు ముంబై తరుపున ఆడుతున్న ఈ శ్రీలంక బౌలర్ , ముంబై ఇండియన్స్ బౌలింగ్ ని ముందుండి నడిపించాడు.ముంబై కి 110 మ్యాచ్ లు ఆడగా 144 వికెట్ లు తీసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిగా వికెట్ లు తీసిన బౌలర్ గా నిలిచాడు .

మలింగ మొత్తం ఐపీఎల్ ఆదాయం 48 కోట్లు.

3.హర్భజన్ సింగ్ – 54 కోట్లు

ఇండియన్ స్పిన్నర్ హర్భజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడాడు.భజ్జి తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 149మ్యాచ్ లు ఆడగా 134 వికెట్లు తీసాడు.

ఇతని ఐపీఎల్ ఆదాయం 54 కోట్లు.

2.రవిచంద్రన్ అశ్విన్ – 58 కోట్లు

అశ్విన్ తన ఐపీఎల్ మ్యాచ్ లు ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు , ఆ జట్టు ఐపీఎల్ లో టాప్ జట్టుగా ఉండడం లో అశ్విన్ ది కీలక పాత్ర.ఇతను ఐపీఎల్ లో చెన్నై, పుణె , పంజాబ్ లకి ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్ లో అశ్విన్ 125 మ్యాచ్ లు ఆడగా 110 వికెట్ లు తీసాడు , ఐపీఎల్ లో అన్ని సీజన్ల కలిపి అత్యధిక పారితోషకం తీసుకున్న భారత బౌలర్ అశ్విన్ .ఇతని ఐపీఎల్ ఆదాయం58 కోట్లు.

1.సునీల్ నరైన్ – 71 కోట్లు

2012 లో మొదటి సారి నరైన్ ని కోల్ కత్తా నైట్ రైడర్స్ తీసుకుంది , ఆ సీజన్ లో నరైన్ చక్కని ప్రదర్శన చేసాడు .

ప్రతి సీజన్ కోల్ కత్తా జట్టు విజయం కోసం అద్భుతంగా ప్రదర్శన చేసాడు.ఐపీఎల్ లో మొత్తం 7 సీజన్ లు ఆడగా 98 మ్యాచ్ లలో 112 వికెట్ లు తీసాడు .

90 కి పైగా ఐపీఎల్ మ్యాచ్ లు ఆడినప్పటికి తన బౌలింగ్ ఎకానమీ 6.58 మాత్రమే.ఇప్పటి వరకు అతడు కోల్ కత్తా జట్టుకు తప్ప ఏ ఐపీఎల్ జట్టుకు ఆడలేదు.ఐపీఎల్ లో ఆడిన బౌలర్లందరిలో అత్యధిగా పారితోషికం తీసుకున్న బౌలర్ సునీల్ నరైన్ అతని మొత్తం ఐపీఎల్ ఆదాయం 71 కోట్ల రూపాయలు.

తాజా వార్తలు

Highest Earning Bowlers In The Indian Premier League- Related....