జిహెచ్ఎంసి పై సీరియస్ అయిన హైకోర్టు..!!

ఇటీవల పెన్షన్ డబ్బులతో ఓ వృద్ధ దంపతులు రోడ్లపై గుంతలు పొడిచే కార్యక్రమం చేస్తూ ఉండటం ఆ కథనం పత్రికలో రావడంతో హైకోర్టు విచారణ జరిపి జిహెచ్ఎంసి పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.వృద్ధ దంపతులు రోడ్ల మరమ్మతులకు కార్యక్రమాలు చేస్తుంటే జిహెచ్ఎంసి అధికారులు అసలు ఏం చేస్తున్నారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

 Highcourt Serious Comments On Ghmc Telangana Highcourt, Ghmc, Highcourt Serious-TeluguStop.com

రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుంబిగించి.గుంతలు పూడ్చటం జీహెచ్ఎంసీకి సిగ్గుచేటు అంటూ న్యాయస్థానం మండిపడింది.

అదే రీతిలో జిహెచ్ఎంసి అధికారులకు ఇచ్చే జీతాలు తిలక్ దంపతులకు ఇవ్వడం మేలు అని హైకోర్టు అభిప్రాయపడింది.రోడ్లపై గుంతల వల్ల ప్రమాదాలలో ప్రాణాలు పోతుంటే, వాహనాలు దెబ్బతింటే చూస్తూ ఊరుకోవడం దారుణం అంటూ జిహెచ్ఎంసి పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

పనిచేయని జీహెచ్ఎంసీకి బడ్జెట్ తగ్గించడం బెటరని అంది.ఈ సందర్భంలో జిహెచ్ఎంసి తరపు న్యాయవాది హైదరాబాద్ నగరంలో అద్భుతమైన రోడ్లు నిర్మిస్తున్నట్లు.తెలియజేయగా అయితే రోడ్లపై గుంతలు లేవా ? న్యాయవాదులతో తనిఖీ చేయించాలా.? అంటూ కోర్టు ప్రశ్నించింది.ఈ క్రమంలో జోనల్ వారిగా జోన్ కమిషనర్లు నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణ వారం రోజుల తర్వాత వాయిదా వేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube