జగన్ పై దాడి : బాబుకి నోటీసులు ..!  

  • విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడి కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా ఎనిమిదిమందికి హైకోర్టు నోటీసులు జరీ చేసింది. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ విచారించిన ధర్మాసనం ముఖ్యమంత్రి, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీతోపాటు రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్న ఐదుగురికి నోటీసులు జారీ చేసింది.

  • Highcourt Notices To Chandra Babu Naidu-

    Highcourt Notices To Chandra Babu Naidu

  • ఆ నోటీసులకు రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక రెండు వారాల్లో దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సూచిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.