ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.ఇప్పటికే పలు కేసుల్లో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.

 High Court Shock To Ap Govt, Ap High Court, Temple Lands, Housing, Ys Jagan Govt-TeluguStop.com

మూడు రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహారాలతో పాటు దాదాపు 60 కేసుల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇవ్వడం ఏపీలో పెద్ద చర్చనీయాంశమైంది.హైకోర్టులో వరుసగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తుండటంతో కొంతమంది వైసీపీ నేతలు హైకోర్టుని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.

అయితే తాజాగా మరో కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆలయ భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.విజయనగరం జిల్లా గుంపం గ్రామంలో ఆలయ భూములను ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించగా.

దీనిని వ్యతిరేకిస్తూ గుంపం గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ వ్యవహారంపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది.ఆలయ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించవచ్చనే నిబంధన ఎక్కడ ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

కౌంటర్ దాఖలు చేసేవరకు ఇళ్ల స్థలాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టులు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube