మాజీ జడ్జి కోడలు పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు

మాజీ జడ్జి నూతి రామ్మోహన్ కోడలు సింధు శర్మ కు కేసు పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది.సింధు శర్మ పెద్ద కూతురు అయిన రిషిత ను తనకు అప్పగించాలి అంటూ సింధు శర్మ కోర్టును ఆశ్రయించడం తో హైకోర్టు విచారణ చేపట్టి బిడ్డను తల్లికి అప్పగించాలి అని తెలిపింది.

 Highcourt Arguments Done In Ex Judge Daughter In Law Pitition-TeluguStop.com

అయితే వారానికి రెండు రోజులు మాత్రం తండ్రి వద్ద ఉండవచ్చని శుక్రవారం సాయంత్రం రిషితను తీసుకెళ్లి తిరిగి సోమవారం తల్లికి అప్పగించాలి అంటూ హైకోర్టు ఆదేశించింది.కోర్టు లో రిషిత తల్లి వద్దే ఉండడానికి అంగీకరించడం తో కోర్టు పై మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే జూన్ 4 వరకు ఈ పద్దతి పాటించాలి అని, ఈ కేసు తదుపరి విచారణను జూన్ 4 కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.అయితే ఈ కేసు నుంచి తనను,తన భార్యను తప్పించాలంటూ నూతి రామ్మోహన్ కోర్టు ను కోరగా దానికి కుదరదు అని కోర్టు తేల్చి చెప్పింది.

అయితే భర్త వశిష్ట తో తనకు తెగతెంపులు చేసుకొనే ఆలోచన లేదని సింధు కోర్టు కు స్పష్టం చేయడం తో వశిష్ట,సింధు వేరే కాపురం గనుక పెడితే సింధు ఇష్ట పూర్వకంగా వశిష్ట తో కలిసి ఉండేందుకు ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం జూన్ ఈ కేసు తదుపరి విచారణ సమయంలో కోర్టు కు తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube