అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఆలూరు కోన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరుకానున్నారు.
ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇద్దరికి వేర్వేరు సమయాన్ని కేటాయించారు పోలీసులు.కానీ ఒకే సమయానికి ఇద్దరు స్వామి వారి దర్శనానికి వెళ్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఇంటి దేవుడి దర్శనానికి సమయం ఇవ్వరా అంటూ పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
తనను దర్శనానికి వెళ్లనివ్వకుండా ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులతో జేసీ వాగ్వివాదానికి దిగారు.దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.