వామ్మో “చెక్కెర” ఎక్కువైతే..ఇన్ని సమస్యలా  

మానవ శరీరం మనిషి మేధస్సుకి అంతుచిక్కని ఒక యంత్రం.అసలు మనిషి శరీరం లో ఒక భాగం పనిచేయడానికి మరొక భాగం తో ఉండే సంభందాన్ని చుస్తే మన తయారుచేసిన యంత్రాలు గుర్తుకువస్తాయి..

High Sugar Not Good For Humans Health--

ఇంతటి గొప్ప అమరికని మనం కొన్ని జాగ్రత్తలు పాటించే ఆరోగ్య వంతంగా జీవించే అవకాశం ఉంటుంది.

మనం తినే ఆహారం శరీరానికి తగ్గట్టుగా ఇవ్వవలసిన మొతాదులోనే ఇవ్వాలి లేదంటే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి.తీపి పదార్థాలు అంటే చాలా మందికి ఇష్టమే.

కానీ ఇష్టం కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం మనం చాలా నష్టపోతాం.అందులోనూ ముఖ్యంగా పురుషులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

చెక్కెర ని ఎక్కువగా తీసుకునే వాళ్ళకి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి మతిమరుపు వస్తుంది.

రక్తంలో అనేక రకాలైన మార్పులు జరుగుతాయి.ఈ విషయాన్నే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వారు చేసిన ఓ అధ్యయనంలో ద్వారా తెలిపారు.తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిని అధ్యయనం చేయగా.

షుగర్ వ్యాధితో పాటు అధిక కొవ్వు,ఒబేసిటీ,గుండె సంభందిత రోగాలతో భాదపడుతునట్టు కనుగోన్నారట.తాజాగా 22 ఏండ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న 8 వేల మందిని పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది.అందుకే శరీరానికి తగిన మోతాదులో తీపిని అందించండి,రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువగా చెక్కర కలిగి ఉండే పదార్ధాలని తినకండి అని వైద్యులు సలహా ఇస్తున్నారు.