ప్రొఫెసర్ కత్తిలా ఉందని అఫైర్ పెట్టుకున్నాడు.... చివరికి ఆమె ఇంట్లో దూరి...

ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు.కాగా తాజాగా ఉపాధ్యాయుడు ఓ లేడీ ప్రొఫెసర్ తో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

 High School Teacher Affair With Lady Professor In Chennai After That-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలో “అనిత” అనే మహిళ వృత్తి నిమిత్తమై నివాసముంటోంది.కాగా అనిత స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తోంది.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా అనితకి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నటువంటి “సుధాకర్” అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.దీంతో వీరిద్దరూ అప్పుడప్పుడూ ఏకాంతంగా కలుసుకుని ఎంజాయ్ చేసేవారు.

 High School Teacher Affair With Lady Professor In Chennai After That-ప్రొఫెసర్ కత్తిలా ఉందని అఫైర్ పెట్టుకున్నాడు…. చివరికి ఆమె ఇంట్లో దూరి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సుధాకర్ కి ఇటీవలే స్థానికంగా ఉన్నటువంటి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.దీంతో ఈ విషయం తెలుసుకున్న అనిత సుధాకర్ ని దూరం పెట్టింది.

దీంతో సుధాకర్ అనిత పై కక్ష పెంచుకున్నాడు.అంతేకాక ఆమెను ఎలాగైనా హతమార్చాలని పన్నాగం పన్నాడు.ఈ ప్లాన్ లో భాగంగా అనిత పని నిమిత్తమై బయటకు వెళ్ళినప్పుడు తన ఇంట్లోకి చొరబడి ఆమె ఇంటికి రాగానే దారుణంగా హతమార్చాడు.అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అనంతరం అనిత బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా సుధాకర్ ని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నేరం చేసినట్లు అంగీకరించాడు.

దాంతో సుధాకర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

#Chennai #School Teacher #Tamil Nadu #SchoolTeacher #Lady Professor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు