ఆ జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం అవుతున్న జనాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి పగ పట్టినట్లు పరిస్థితులు నెలకొన్నాయి.భారీ వర్షాల కారణంగా గత కొన్ని రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.66 మండలాలు కలిగిన ఈ జిల్లాలో 42 మండలాల్లో 100 మిల్లీ మీటర్లు వర్షం కురియడంతో.జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారీగా వరద నీరు చేరటంతో 120 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో.ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

 High Rainfall In Chitoor District Tirupati, Chitoor, Andhra Pradesh, Thirupathi-TeluguStop.com

కురిసిన భారీ వర్షాలతో కళ్యాణి డ్యామ్ నిండుకుండలా మారిపోయింది.

ఈ తరుణంలో స్వర్ణముఖి నది వర్షపు నీరుతో ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంది.దీంతో తిరుపతి పట్టణానికి చుట్టుప్రక్కల గ్రామాలకి రాకపోకలు ఆగిపోయాయి.

తిరుపతి నగర ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా.ఇటీవల కురుస్తున్న వర్షాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటూ.లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube