వైద్య ఆరోగ్య శాఖకి అధిక ప్రాధాన్యత

యాదాద్రి జిల్లా:తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకి అధిక ప్రాధాన్యత ఇస్తోందని,హరీష్ రావు వైద్య శాఖ మంత్రిగా పరుగులు పెట్టిస్తున్నారని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.

మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కలెక్టరేట్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు పిహెచ్సిలను సందర్శించడం జరిగిందని,ప్రజలు పూర్తి నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కోరారు.ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి అప్పులపాలు కావద్దన్నారు.

అవసరం లేకున్నా గర్భిణులకు ఆపరేషన్ లు నిర్వహిస్తున్నారని,వీటి పట్ల ప్రభుత్వం యుద్ధమే చేస్తుందని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 శాతం,ప్రైవేట్ ఆస్పత్రిలో 60 శాతం ఆపరేషన్ లు అవుతున్నాయని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ లు,నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని,15 శాతం మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు అవసరం అవుతాయన్నారు.నొప్పులని భరించలేమని,ముహుర్తాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటున్నారని,సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా దయచేసి మూఢవిశ్వాసాలు నమ్మవద్దని తెలిపారు.

Advertisement

యాదాద్రి భువనగిరి జిల్లాలో మలేరియా,డెంగ్యూ కేసులు లేవని,కోవిడ్ అనంతరం ప్రజల్లో వ్యాధి నిరోధకత తగ్గిందని,ఈరోజు వరల్డ్ హైపర్ టెంక్షన్ డే అని,లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు.జిల్లా ప్రతీ ఒక్క ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి లైసెన్స్ లు చెక్ చేయమని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువ అవుతున్నాయని,వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని,పి హెచ్ సి లలో సమయ పాలన పాటించాలని,జనగామ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారని,భువనగిరి లో 20 వ తేదీన వ్యాధి నిర్ధారణ పరీక్షలు సెంటర్ ని ప్రారంభించడానికి మంత్రి హరీష్ రావు జిల్లాకు వస్తున్నారని ప్రకటించారు.త్వరలో ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Latest Yadadri Bhuvanagiri News