భారత్‌కు ఊపందుకోనున్న దౌత్య పర్యటనలు.. త్వరలో ఆ రెండు దేశాల నుంచి ప్రముఖుల రాక

రెండేళ్ల పాటు మనిషిని నాలుగు గోడలకే పరిమితం చేసి.కోట్లాది మందిని బాధితులుగా, లక్షలాది మంది ప్రాణాలు తీసిన కోవిడ్ మహమ్మారి ఇటీవల స్వల్పంగా శాంతించిన సంగతి తెలిసిందే.

 High Level Visits From Colombia, Mexico To India In Few Weeks , Colombian President Evan Duke Marquez, Marcelo Abrard, Ovl, India-colombia, Colombia Vice President Martha Lucia Ramirez, Indian Foreign Minister Dr. S. Jaishankar-TeluguStop.com

ఈ నేపథ్యంలో వర్తక, వాణిజ్యాలు ఊపందుకున్నాయి.అటు అంతర్జాతీయ విమాన సర్వీసులపై వున్న ఆంక్షలను కూడా ఒక్కో దేశం ఎత్తేస్తూ వస్తోంది.

కొత్త వేరియంట్‌లు పుట్టుకురాకుంటే కోవిడ్ ఇక సీజనల్ వ్యాధిగా మారిపోతుందని అంటున్నారు.అదే జరిగితే అన్ని దేశాలు కోవిడ్ పూర్వ స్థితికి చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

 High Level Visits From Colombia, Mexico To India In Few Weeks , Colombian President Evan Duke Marquez, Marcelo Abrard, OVL, India-Colombia, Colombia Vice President Martha Lucia Ramirez, Indian Foreign Minister Dr. S. Jaishankar-భారత్‌కు ఊపందుకోనున్న దౌత్య పర్యటనలు.. త్వరలో ఆ రెండు దేశాల నుంచి ప్రముఖుల రాక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో భారత్‌లో లాటిన్ అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధులు పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ మార్క్వెజ్, మెక్సికన్ విదేశాంగ కార్యదర్శి మార్సెలో ఎబ్రార్డ్‌లు మరికొద్ది వారాల వ్యవధిలో భారత పర్యటనకు రానున్నారు.

ఇరుపక్షాల మధ్య సంబంధాలు పటిష్టమైన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది.ఇకపోతే.

భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ విదేశీ లిమిటెడ్ (ఓవీఎల్) చమురు అన్వేషణ, ఉత్పత్తి రెండింటిలోనూ పాలుపంచుకున్న ఏకైక దక్షిణ అమెరికా దేశం కొలంబియానే.

అంతేకాదు భారత్- కొలంబియాల మధ్య అంతరిక్ష సహకారం కూడా వుంది.

నవంబర్ 2018లో ఇస్రో.కొలంబియా వైమానిక దళానికి చెందిన FACSAT 1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ- సీ43/HysIS మిషన్‌‌లో భాగంగా ప్రయోగించింది.

ఇది కొలంబియా వైమానిక దళానికి చెందిన మొట్టమొదటి ఉపగ్రహం.కొలంబియా వైస్ ప్రెసిడెంట్ మార్తా లూసియా రామిరెజ్ గతేడాది భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇకపోతే.మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ పర్యటన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంప్రదింపులను ఉద్దేశించే సాగుతుందని అంచనా.భారత్- మెక్సికోలు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలు.గతేడాది భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మెక్సికోను సందర్శించారు.40 ఏళ్ల తర్వాత ఓ భారత విదేశాంగ మంత్రి మెక్సికోలో పర్యటించడం అదే తొలిసారి.

కరోనా వైరస్ ఆంక్షలకు సంబంధించి ఢిల్లీకి మరిన్ని దౌత్యపరమైన పర్యటనలు చోటు చేసుకుంటాయని అంచనా.

జపాన్ కొత్త ప్రధాని ఫుమియో కిషిడా రాబోయే వారాంతంలో ఇండియాకు రానునున్నారు.గతేడాది డెన్మార్క్ ప్రధాన మంత్రి, రష్యా అధ్యక్షుడు ఢిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే.

High Level Visits From Colombia

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube