జార్జ్ ఫ్లాయిడ్ హత్య: భారతీయ క్రీడాకారుడి నాయత్వంలో అమెరికాలో జాతి వ్యతిరేక ఉద్యమం

అమెరికాలో శ్వేతజాతి పోలీసుల చేతిలో హత్యకు గురైన ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై అగ్రరాజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే.అప్పటి వరకు శ్వేతజాతీయుల ఆగడాలను పంటి బిగువన భరించిన నల్లజాతీయులు.

 India's National High Jump Record-holder Tejaswin Shankar Leads Anti-racism Prot-TeluguStop.com

తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు.వీరి నిరసనకు సామాన్యుల నుంచి అన్ని రంగాల ప్రముఖుల వరకు మద్ధతుగా నిలుస్తున్నారు.

ఇప్పటికే స్టార్ క్రీడాకారులు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు.జాత్యహంకారానికి వ్యతిరేకంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరిట జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.ఇప్పటికే క్రికెటర్లు, ఫుట్‌బాల్ క్రీడాకారులు తమ జెర్సీలపై బ్లాక్ లైవ్స్ మ్యాటర్ లోగోలను ముద్రించుకున్నారు.అలాగే ఫార్ములా వన్ రేసర్ హామిల్టన్ నలుపు కార్లతో పోటీపడ్డాడు.

Telugu Racism, George Floyd, Indiasnational, Trump-

తాజాగా అమెరికాలోని కాన్సాస్ వర్సిటీలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి.ఈ ఆందోళనల్లో భారతీయ విద్యార్ధులు కూడా పాల్గొనడం విశేషం.ఇందులో భారత్‌కు చెందిన హైజంపర్ తేజస్విన్ శంకర్ ఉన్నారు.నిరసనలు ఉద్దృతంగా సాగుతున్న సమయంలో ‘‘ డ్రగ్స్ రహిత మాసంగా మార్చిన జార్జ్ ఫ్లాయిడ్‌కు అభినందనలు అంటూ అమెరికన్ స్టూడెంట్స్ ఫస్ట్ గ్రూప్ అధ్యక్షుడు జాడెన్ మెక్నీల్ చేసిన ట్వీట్ కాన్సాస్‌లో మరింత అగ్గిని రాజేసింది.

ఈ క్రమంలో తేజస్విన్ నేతృత్వంలోనే యూనివర్సిటీలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి.నల్లజాతి అథ్లెట్లందరికీ ఆయన మద్ధతు ప్రకటించాడు.

శరీర రంగు ఆధారంగా తోటివారిని అవమానపర్చడం దారుణమని తేజస్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇతర విద్యార్ధుల నుంచి ఇలాంటి వర్ణ వివక్ష కొనసాగితే వారు శిక్షణ మరియు పోటీల నుంచి తప్పుకుంటారని ఆయన హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube