బెల్లంకొండ హీరోపై ఇంత పెట్టుబడా? సూపర్‌ ట్రైలర్‌       2018-07-08   02:10:27  IST  Raghu V

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మొదటి సినిమా నుండి కూడా భారీ తనంతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ యువ హీరో మొదటి చిత్రం ‘అల్లుడు శీను’. ఆ చిత్రాన్ని స్వయంగా హీరో తండ్రి బెల్లంకొండ సురేష్‌ దాదాపుగా 40 కోట్ల బడ్జెట్‌తో వినాయక్‌ దర్శకత్వంలో నిర్మించడం జరిగింది. ఇద్దరు స్టార్‌ హీరోయిన్స్‌తో పాటు, భారీ సెట్టింగ్‌లు, పెద్ద ఎత్తున సన్నివేశాలతో ఆ చిత్రం అదిరిపోయేలా దర్శకుడు వినాయక్‌ తెరకెక్కించాడు. ఆ సినిమా సక్సెస్‌ అయినా కూడా నిర్మాత ఎక్కువ పెట్టబడి పెట్టడంతో రికవరీ కాలేదు .అయినా కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌కు స్టార్‌ క్రేజ్‌ దక్కింది. అప్పటి నుండి కూడా వరుసగా బెల్లంకొండ శ్రీనివాస్‌ భారీ చిత్రాలనే చేస్తున్నాడు.

తాజాగా ఈ హీరో చేసిన చిత్రం ‘సాక్ష్యం’. గత చిత్రం ‘జయ జానకి నాయక’ చిత్రం సూపర్‌ సక్సెస్‌ అయినా కారణమో లేదంటే బెల్లంకొండపై ఉన్న నమ్మకమో కాని ‘సాక్ష్యం’ చిత్రాన్ని ఏకంగా 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడం జరిగింది. ఒక యువ హీరో సినిమాకు ఈ స్థాయిలో ఖర్చు చేయడం అనేది చాలా అతి. కాని ఈయన గత చిత్రాల అనుభవంతో ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లుగా చిత్ర నిర్మాత అభిషేక్‌ నామా అంటున్నాడు. తాజాగా సినిమా ట్రైలర్‌ చూసిన తర్వాత బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. బెల్లంకొండతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని శ్రీవాస్‌ తెరకెక్కించాడు.

దర్శకుడు శ్రీవాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ద హస్తుడు. ఆయన ఏమాత్రం సందేహం లేకుండా భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిర్మాత కూడా హీరో మరియు దర్శకుడిపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రం నిర్మాణ భాగస్వామిగా బెల్లంకొండ సురేష్‌ అనధికారికంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి

ఏది ఎలా ఉన్నా, బడ్జెట్‌ గురించి పక్కన పెడితే సినిమా మాత్రం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దర్శకుడు శ్రీవాస్‌ ఒక మంచి సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని ట్రైలర్‌ చూసిన తర్వాత అర్థం అవుతుంది. తప్పకుండా ఇది మరో సక్సెస్‌గా బెల్లంకొండకు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ట్రైలర్‌లో భారీతనం, కొత్తదనం, బెల్లంకొండ హీరోయిజం, జగపతిబాబు విలనిజం ఇలా అన్ని కలిపి సినిమా భారీగా ఉండటంతో పాటు బాగుంటుందనిపిపిస్తుంది. ఈనెల 27నప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ రేంజ్‌ వసూళ్లను సాధిస్తుందో చూడాలి.