‘ఇండియన్‌ 2’ స్థాయిని అమాంతం పెంచేసిన శంకర్‌   High Expectation On Shankar Indian 2 Movie     2018-11-15   09:59:37  IST  Ramesh P

రెండు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘భారతీయుడు’. ఒక స్వాతంత్య్ర సమరయోధుడు అవినీతిని అంతం చేసేందుకు కంకణం కట్టుకుని చేసిన పోరాటమే ‘భారతీయుడు’ చిత్రం. ఆ చిత్రంలో కమల్‌ హాసన్‌ అద్బుతమైన పాత్రను పోషించాడు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఇప్పటికి బుల్లి తెరను షేక్‌ చేస్తూనే ఉంది. ఆ చిత్రంకు సీక్వెల్‌ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కమల్‌ హాసన్‌ కోరుకుంటున్నాడు.

కమల్‌ కోరిక ఇన్నాళ్లకు తీరబోతుంది. శంకర్‌ ‘భారతీయుడు’ సీక్వెల్‌ ను ‘ఇండియన్‌ 2’ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా తాజాగా ప్రారంభం అయ్యాయి. ఇక ఈ చిత్రంలో కమల్‌ తో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కమల్‌ హాసన్‌ తో పాటు దుల్కర్‌ సల్మాన్‌ మరియు శింబులు ఈ చిత్రంలో కనిపించడం ఖాయం అని తెలుస్తోంది. భారీ ఎత్తున ఈ చిత్రంను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్న శంకర్‌ యువ హీరోల ఎంపికతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు.

High Expectation On Shankar Indian 2 Movie-Dulquer Salmaan Movie Kamal Hassan Shimbu

తెలుగులో కూడా ‘ఇండియన్‌ 2’కు భారీ క్రేజ్‌ ఉన్న కారణంగా తెలుగు యువ హీరోను కూడా ఈ చిత్రంలోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మలయాళం నుండి దుల్కర్‌ ను ఎంపిక చేసిన శంకర్‌, తెలుగు నుండి కూడా ఒక హీరోను ఎంపిక చేస్తే మార్కెట్‌ పరంగా కూడా మంచిగా కలిసి వస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి శంకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.