అయోధ్య కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు లో హైడ్రామా  

High Drama At Supreme Court - Telugu , Hindhu Maha Sabha Ram Lall, Rajiv Dhavan, Ram Birth Place, Ramjan Gogayi, Read The Book In November Month, Supreme Court

బుధవారం అయోధ్య కేసు విచారణ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.అయితే వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పు ను రిజర్వ్ లో పెట్టింది.

High Drama At Supreme Court

అయితే ఈ కేసు వాదనలు జరుగుతున్న సమయంలో సుప్రీం కోర్టు లో హైడ్రామా నడిచింది.విచారణ చివరి రోజు కావడం తో బుధవారం హిందూ మహా సభ రామ్ లాలా(రాముని జన్మ స్థలం) ఉండేదనడానికి సాక్ష్యా ధారాలు ఉన్నాయని వాటిని చూపించే ప్రయత్నం చేయగా ఈ క్రమంలో ముస్లిం వక్స్ బోర్డు తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ వాటిని చించి వేశారు.

తోలి నుంచి రాముడు ఆ వివాదాస్పద స్థలంలోనే జన్మించారని,దానికి తగిన ఆధారాలు ఉన్నాయని వాదిస్తూ వచ్చిన హిందూ మహాసభ లాయర్ వికాస్ సింగ్ అన్నట్లుగానే ఒక కొత్త పుస్తకాన్ని కోర్టు అనుమతి తీసుకొని మరీ బుధవారం ప్రవేశపెట్టారు.అయితే కొత్త పుస్తకం తెచ్చి దీనిని రికార్డ్ లలో పెట్టాలని చూస్తున్నారు అంటూ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన రాజీవ్ ధావన్ దానిని చింపివేస్తాను అంటూ హెచ్చరించారు.

అయోధ్య కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు లో హైడ్రామా-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే బుధవారం ఇరువురు వాదనలు వినిపించే క్రమంలో మళ్లీ అడ్డు తగిలిన ధావన్ ఈ క్రమంలో గట్టిగా మాట్లాడుతూ ఆవేశం,కోపం పట్టలేక ఆ మ్యాప్ ని చింపివేశారు.అయితే సుప్రీం జడ్జి ల ఎదురుగానే ధావన్ చేసిన చర్య తో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్… విచారణ ఇలాగే కొనసాగితే.

దీన్ని ముగించి లేచి వెళ్లిపోతామని ఆవేశంగా పేర్కొన్నారు.అసలు ఈ వ్యవస్థే భ్రష్టు పట్టింది.

మేం వాకౌట్ చేస్తాం అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించిన ఆయన కాసేపటికి శాంతించి ఆ పుస్తకాన్ని తాను చదువుతానని చెప్పారు.

 అసలు నవంబరు వరకూ చదువుతూనే ఉంటా అని కూడా అన్నారు.నవంబరు 17 న ఆయన రిటైర్ కానున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన నవంబర్ వరకు చదువుతాను అని చెప్పినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం వాదనలు విన్న సుప్రీం అయిదుగురు జడ్జీల ధర్మాసనం ప్రస్తుతం తీర్పు ను రిజర్వ్ లో పెట్టింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

High Drama At Supreme Court-hindhu Maha Sabha Ram Lall,rajiv Dhavan,ram Birth Place,ramjan Gogayi,read The Book In November Month,supreme Court Related....