కోడి కత్తి కేసు: ఏపీ పోలీసులపై హైకోర్ట్ ఆగ్రహం !

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి తో జరిగిన దాడి వ్యవవహారం ఒక పట్టాన కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు.ప్రస్తుతం ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.

 High Court Was Angry With Ap Police-TeluguStop.com

అయితే ఈ కేసులో ఏపీ ప్రభుత్వం అధికారులకు సక్రమంగా సహకరించడంలేదు.ఏ కేసు అంతకు ముందు సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది.తాజాగా….ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసుల తీరుపై ఎన్ఐఏ కోర్టు సీరియస్ అయ్యింది.

ఈ కేసుకు సంబంధించి సీట్ వద్ద ఉన్న ఆధారాలు, వివరాలన్నీ ఎన్ఐఏకి అప్పగించాలని కోర్టు విశాఖపట్నం ఏసీపీ నాగేశ్వరరావుకు ఆదేశాలిచ్చింది.

తమ విచారణకు సిట్ పోలీసులు సహకరించడం లేదని, ఆధారాలు ఇవ్వడం లేదని ఎన్ఐఏ విజయవాడలోని ప్రత్యేక కోర్టులో పిటీషన్ వేశారు.రెండు రోజులుగా ఎన్ఐఏ పిటీషన్ విచారించిన కోర్టు సిట్ పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.ఎన్ఐఏ విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube