ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు !   High Court Verdict On Panchayat Elections     2018-10-23   14:53:22  IST  Sai M

ఏపీలో సర్పంచ్ ల పదవి కాలం ముగిసినా .. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమిస్తోందని, దిగువ క్యాడర్ ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తోందని మాజీ సర్పంచులు హైకోర్టు లో సవాల్ చేశారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 90ని కొట్టేసింది. అంతేకాదు, మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది