యాప్ విషయంలో నిమ్మగడ్డ కి అదిరిపోయే బ్రేక్ వేసిన కోర్టు..!! 

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఎక్కడా కూడా ఏకగ్రీవాలు అవ్వకుండా అధికార పార్టీ వైసీపీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు.

 Nimmagadda Ramesh Kumar,e Watch App, Ycp, Ap Panchayat Elections, Ycp Leaders, S-TeluguStop.com

ఇటువంటి తరుణంలో ఎన్నికల విషయంలో ప్రభుత్వ నిఘా యాప్, పంచాయతీ యాప్ వాడకుండా…  సొంతంగా అందుబాటులోకి “ఈ వాచ్” యాప్ తీసుకురావటం వైసీపీ నేతలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లు అయిన సంగతి తెలిసిందే.ఏదైనా ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయాలని విజయవాడ ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రారంభించడం జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం.నిమ్మగడ్డ తీసుకొచ్చిన యాప్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.తాజాగా ఈ పిటిషన్ విచారణకు రావటంతో హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈనెల 9వ తారీకు వరకు ఈ యాప్ వాడకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చింది.

దీంతో నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయానికి అదిరిపోయే బ్రేక్ హైకోర్టు వేసినట్లయింది.మరోపక్క ఈ యాప్ పనితనం మొత్తం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి జరుగుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అందువల్లే ప్రభుత్వ యాప్ అదేవిధంగా పంచాయతీ యాప్ కాకుండా.నిమ్మగడ్డ ఈ యాప్ అందుబాటులోకి తెచ్చారు అని.వైసీపీ నేతలు కీలక కామెంట్లు చేస్తున్నారు.ఏదిఏమైనా నిమ్మగడ్డ తీసుకొచ్చిన కొత్త యాప్ పై.హైకోర్టు బ్రేకు వేసినట్టు.ఉత్తర్వులు జారీ చేయడంతో వైసీపీ వర్గంలో సంతోషం నెలకొంది.

  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube