అంబులెన్స్ లు అడ్డుకోవటం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు...!! 

ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి రాష్ట్రంలోకి వస్తున్న అంబులెన్సులు తెలంగాణ ప్రభుత్వం ఆపడం పట్ల  రిటైర్డ్ ఐఆర్ఎస్ వెంకట కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా సరిహద్దులలో తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మండిపడింది.

 High Court Shocks Telangana Government Over Obstruction Of Ambulances-TeluguStop.com

ఆంబులెన్స్ లు ఆపే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొంది.అంతమాత్రమే కాకుండా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ .అంబులెన్స్ లు ఆపొద్దని పోలీస్ శాఖని హైకోర్టు ఆదేశించింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది.

 High Court Shocks Telangana Government Over Obstruction Of Ambulances-అంబులెన్స్ లు అడ్డుకోవటం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు… -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు అంబులెన్స్ అడ్డుకోవడం చట్టవిరుద్ధమని కోర్టు ప్రకటించాలని కోరారు.మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు పడకలు సరిపోకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.

అయితే ఈ విషయంలో న్యాయస్థానం కలుగజేసుకుని అంబులెన్స్ ను నిలువరించడం రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించడమే అంటూ చీవాట్లు పెట్టింది.ఏదిఏమైనా జాతీయ రహదారులపై రాకపోకలను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ రెండు వారాల లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు అదేవిధంగా కేంద్రానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసి జూన్ 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.

#TelanganaHigh #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు