పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన హైకోర్టు

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది.ఎస్సీ కార్పొరేషన్ కు చెందిన ఉద్యోగుల వివాదంలో ఆయనకు రెండు నెలల జైలు.

 High Court Sentences Wg Collector To One Month Jail Term In Contempt Case-TeluguStop.com

రెండువేల రూపాయల జరిమానా విధించింది.గాథాయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ పాటించకుండా నిర్లక్ష్మ చూపారంటూ.

కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే… జిల్లా ఎస్సీ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న ఎస్‌.

వి.శేషగిరి రావు, మరో ఐదుగురుకి జూనియర్‌ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్‌ వచ్చింది.ఆ హోదాలో జీతాలు అందుకుంటున్నారు.

అయితే వీరిని నిబంధనలకు విరుద్దంగా పర్మినెంట్ చేసి ప్రమోషన్ ఇచ్చారంటూ వారికి ఇస్తున్న జీతాలను కలెక్టర్ ఆపేశారు.దాంతో 2015లో ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు.పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లింది.కానీ సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలపై ఎలాంటి స్టే ఇవ్వలేదు.

అయినా సరే హైకోర్టు తీర్పు మేరకు జీతాలు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించలేదు.ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద జిల్లా ఎస్సీ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చైర్మన్‌ హోదాలో ఉన్న కలెక్టర్ కాటంనేనికి జైలు శిక్ష విధించింది కోర్టు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube