జగన్ పై దాడి కేసు: హైకోర్టు కీలక తీర్పు ! బాబుకి చిక్కులు తప్పవా ...?

విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసుపై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

 High Court Sensational Judgement On Attack On Ys Jagan-TeluguStop.com

న్ఐఏ యాక్ట్ ప్రకారం ఎన్ఐఏకు కేసు దర్యాప్తు అప్పగించాలని జగన్ తరపు న్యాయవాది కోటరాజు వెంకటేశ్ శర్మ హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్ట్ ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించకుండా సిట్ దర్యాప్తు చేస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని జగన్ తరపు న్యాయవాది వాదించారు.ఫలితంగా సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

జగన్ తరపు వాదనలు విన్న హైకోర్టు ఆయన వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీ భవించింది.

ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్ర, రాష్ట్రాలను హైకోర్టు గతంలోనే అడిగి తెలుసుకుంది.

ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, తామే తీసుకుంటామని హైకోర్టు గతంలోనే చెప్పింది.దీంతో కేంద్రం దిగొచ్చి ఎన్‌ఐఏ విచారణకు అంగీకరించింది.

పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో అక్టోబర్‌ 25న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పక్కనే ఉన్న ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.రక్షణశాఖకు చెందిన తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మినహా కేంద్రం మొదలు అన్ని రాజకీయ పక్షాలూ అనుమానిస్తూ వచ్చాయి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా థర్డ్ పార్టీ విచారణకు డిమాండ్ చేశారు.గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు పలు కేంద్రమంత్రులను కోరారు.విమానాశ్రయంలో దాడి జరిగితే షెడ్యూల్ ఎఫెన్స్ కింద కేసు నమోదు చేసి సెక్షన్ 3ఏ చట్టం కింద ఎన్ఐఏకు కేసును దర్యాప్తు చేపట్టాలని అయితే అందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించడంలేదని వైసీపీ నేతలు ఆరోపించారు.

మరోవైపు జగన్ పై దాడికి సంబంధించి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాము థర్డ్ పార్టీ విచారణ కోరుతున్నామని అందుకు అనుగుణంగా హైకోర్టు ఎన్ఐఏకు అప్పగించడం శుభపరిణామం అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube