కంగనా ట్విట్టర్ లో ఏమైనా చెయ్యచ్చు.. తనకు ఆ హక్కుంది!

కంగనా రనౌత్.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమెకే తెలియదు.వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ కంగనా రనౌత్.ఏ హీరోను ఎప్పుడు తిడుతుందో తెలీదు.ఏ దర్శకుడిపై ఎప్పుడు నిందలు వేస్తుందో తెలీదు.

 Kangana Ranaut Has The Right To Express Her Thoughts', Says Bombay Hc, Kangana R-TeluguStop.com

నిందలు అని కాదు లెండి.ఉన్న నిజాలనే బహిరంగంగా బయటపెడుతుంది.

ఇక అలానే ట్విట్టర్ వేదికగా 2020 సంవత్సరం అంతా కూడా ఆమె ఎన్నో కాంట్రావర్సీ ట్విట్స్ చేసింది.ఆ ట్విట్స్ చుసిన నెటిజన్లు సైతం షాక్ అయ్యారు.
ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం సమయంలో ఆమె ఇలాంటి ట్విట్స్ ఏ చేసింది.బాలీవుడ్ ఏ బంధు ప్రీతితో సుశాంత్ సింగ్ రాజపుత్ ని చంపేసింది అంటూ బడా బాలీవుడ్ సెలబ్రెటీస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

అనంతరం డ్రగ్స్ ఇష్యూపై మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇంకా ఈ నేపథ్యంలోనే కంగన రనౌత్ ట్విటర్ వేదికగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని తన మతపరమైన నమ్మకాలను దెబ్బతీశారని న్యాయవాది అలీ ఖాసిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ముంబై హైకోర్టును ఆశ్రయించారు.

Telugu Bollywood, Bombay, Kangana Ranaut, Kanganaranaut, Kangana, Mumbai, Bombay

ఈ మేరకు ఒక క్రిమినల్ పిటిషన్ దాఖలు చెయ్యగా ఆ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపారు.ఆ విచారణలో హైకోర్టు కంగనాకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది.ట్విటర్‌లో ప్రతి ఒక్కరికీ ఖాతా ఉంటుందని, అందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు కూడా వారికి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.భావ ప్రకటన స్వేచ్ఛకు జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు చాలా తేడా ఉంటుందని ధర్మాసనం చెప్పుకొచ్చింది.

కంగనా రనౌత్ వ్యాఖ్యలు జాతి వ్యతిరేక వ్యాఖ్యలుగా భావించలేం.ఇందుకు కంగన ట్విట్టర్ ఖాతా సస్పెండ్ చెయ్యం కుదరదని ముంబై హైకోర్టు వ్యాఖ్యానించిందని ధర్మాసనం తేల్చి చెప్పింది.

అనంతరం ఈ కేసులో తీర్పును 2021 జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube