చిత్తూరు రేపిస్ట్‌కు ఉరిశిక్ష రద్దు చేసిన హైకోర్టు

గతేడాది నవంబర్ నెలలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో బాలికపై అత్యాచారం జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ హత్య కేసులో ఉరిశిక్ష పడిన నిందితుడు మహమ్మద్ రఫీకి హైకోర్టులో ఊరట లభించింది.

 Mohammed Rafi, Crime, Chitthur-TeluguStop.com

అతడి శిక్షను యావజ్జీవగా మారుస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.బాలిక హత్యాచారం కేసులో రఫీకి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

అయితే శిక్ష తగ్గించాలంటూ అతడి తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అతడి మరణశిక్షను తగ్గిస్తూ యావజ్జీవ శిక్షగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన వర్షిత తల్లిదండ్రులతో కలిసి నవంబర్ నెలలో చేనేత నగర్‌లోని కల్యాణ మండపంలో పెళ్లికి వెళ్లింది.కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతూ చుట్టుపక్కల గాలించారు.ఫంక్షన్ హాల్ వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించడంతో అంతా షాకయ్యారు.పోస్టుమార్టం నివేదికలో వర్షితపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలియడంతో అంతా షాకయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

నాలుగు రోజుల్లోనే నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేశారు.పోలీసులకు దొరక్కుండా గుండు గీసుకుని తిరుగుతున్న అతడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

అయితే ఈ కేసులో అన్ని ఆధారాలను పోలీసులు జిల్లా న్యాయస్థానికి సమర్పించారు.ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం రఫీని దోషిగా నిర్ధారించింది.అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.కోర్టు తీర్పుపై చిన్నారి కుటుంబంతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

అయితే నిందితుడి తరపున లాయర్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఉరిశిక్ష.యావజ్జీవ కారాగార శిక్షగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube