గత కొంతకాలంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి, ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య చాలా కాలంగా వార్ నడుస్తోంది.ఆ వార్ అలా కొనసాగుతుండగానే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు.
ఈ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు.
దీనిపై ఈసీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.ఈ మేరకు ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్ లో యధావిధిగా ఎన్నికలను కొనసాగించాలని కోరుతూ సూచించింది.ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఏపీలో ఎన్నికలకు వెళ్ళకూడదనే ఆలోచనలతో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఉంటూ వచ్చింది.
ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా బీజేపీతో పాటు పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేస్తారని ఇవన్నీ టిడిపికి కలిసి వస్తాయని , ప్రభుత్వం కు కూడా ఇవన్నీ బాగా కలిసి వస్తాయని ఏపీ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.అందుకే ఏదో ఒక కారణం చూపించి ఎన్నికలను వాయిదా వేయించాలని చాలాకాలంగా చూస్తున్నా, అవేవీ ప్రభుత్వానికి అనుకూలంగా మారడం లేదు.
సుప్రీంకోర్టు వెళ్ళినా ఏపీ ప్రభుత్వానికి ఊరట వచ్చే అవకాశం ఉందా లేదా అనేది సందేహం గానే మారింది.ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగ వ్యవస్థ.ఈ వ్యవస్థలో కోర్టుల జోక్యం అంతంత మాత్రంగానే ఉంటుంది.ఇది ఇలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ కి అనుకూలమైన వ్యక్తి అని, ఆయన హయాంలో ఎన్నికలకు వెళ్తే చిక్కులు తప్పవు అనే అభిప్రాయంలో ఏపీ అధికార పార్టీ టెన్షన్ పడుతోంది.