హైదరాబాద్ లో కుక్కల దాడి ఘటనలో బాలుడి మృతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం ఇటువంటి ఘటనలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది.
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో పసి బాలుడు చనిపోయాడని హైకోర్టు మండిపడింది.ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.
ఈ క్రమంలో తెలంగాణ సీఎస్, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.