ఏపీలో హైకోర్టు ఏర్పాటు ! ముహూర్తం ఫిక్స్

చాలాకాలంగా పెండింగ్ లో పడిపోయిన హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారైంది.ఏప్రిల్ 7న ఏపీ హైకోర్టు అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి నోటిఫై చేశారు.

 High Court In Ap Date Fix-TeluguStop.com

దీంతో ఏప్రిల్ 7నుంచి నేలపాడులో ఏపీ హైకోర్టు ప్రారంభం అవ్వబోతోంది.రాష్ట్ర విభజన అనంతరం హైకోర్టును కూడా విభజించాలని తెలంగాణ న్యాయవాదుల నుంచి డిమాండ్ కూడా ఎక్కువయ్యింది.

అయితే.ఏపీలో హైకోర్టు నూతన భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు భవనంలోనే ఇరు రాష్ట్రాల న్యాయస్థానాలు కొనసాగుతాయని అప్పటి యూపీఏ ప్రభుత్వం పేర్కొంది.

హైకోర్టు విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కేంద్ర న్యాయశాఖా మంత్రికి కూడా పలు అభ్యర్థనలు కూడా చేసింది.ఏపీ ప్రభుత్వం హైకోర్టు భవన నిర్మాణాన్ని చేపట్టడం.ఆ నిర్మాణాలను పరిశీలించిన న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్రపతి ఏప్రిల్ 7వ తేదీని హైకోర్టు అప్పాయింటెడ్ డేగా ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.ఏప్రిల్ 7వ తేదీ ఉగాది కూడా కావడంతో.

తెలుగు సంవత్సరాది నాడే ఏపీ హైకోర్టు ప్రారంభం కాబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube