నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసును హైకోర్టు సిబిఐ అప్పగిస్తూ తీర్పు చెప్పింది.ఈ తీర్పును తాను స్వాగతిస్తున్నానని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.2017 లో అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై చేసిన ఆరోపణల నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై హైకోర్టులో కేసు వేశారు.దీనిపై కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరి కొంతమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు.
ఈ క్రమంలో కీలక పత్రాలకు సంబంధించి లాప్టాప్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ పత్రాలు నాలుగవ అదనపు జ్యుడీషియల్ కోర్టులో ఉన్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన కొంతమంది దుండగులు కోర్టులో ప్రవేశించి వీటిని ఎత్తుకెళ్లారు.
ఈ విషయంపై అప్పటి కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరిని అరెస్టు చేశారు.కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయినా కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కాగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతోంది.ఇవాళ సిబిఐకి అప్పజెప్తూ నిర్ణయం తీసుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది.
కాగా చంద్రబాబులా సిబిఐ విచారణలపై స్టేలు తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని మంత్రి కాకాని అన్నారు.హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, సిబిఐ విచారణ జరిపితే నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయని ఆయన నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మీడియాకు చెప్పారు.
సీబీఐ విచారణ జరపమని కోర్టులో తానే ఆఫడవిట్ వేశానని వెల్లడించారు.