జేసీ దివాకర్ రెడ్డి కి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జేసీ ఫ్యామిలీ ఒకపక్క ఆర్థికంగా మరోపక్క రాజకీయంగా ఎదురీదుతున్న సంగతి తెలిసిందే.ఒకానొక సమయంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఓ వెలుగు వెలిగిన జేసీ కుటుంబం ఆ సమయంలో జగన్ ని వ్యక్తిగతంగా దూషిస్తూ భారీ స్థాయిలో మీడియా ముందే బూతులు తిట్టడం జరిగింది.

 Jc Diwakar Reddy,ys Jagan, Tdp,ysrcp-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ చాలావరకు ప్రత్యర్థులను అణగదొక్కే రీతిలో దూసుకుపోతున్న క్రమంలో జేసీ ఫ్యామిలీ చేస్తున్న ట్రావెల్స్ వ్యాపారంలో అదేవిధం మైనింగ్ వ్యాపారంలో అవకతవకలు బయటపడటంతో అంతకుముందు ఆరోపణలు ఉండటంతో విచారణ సంస్థల చేత విచారణ చేయించి సరికొత్త షాక్ లు ఇవ్వటమే కాక, జైలుకు కూడా పంపించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా టిడిపి పార్టీ హయాంలో ఐదేళ్ళు లక్షల క్యూబిక్ మీటర్ల బెరైటీస్ ను అక్రమంగా తవ్వకున్నారనే ఆరోపణలపై గనుల శాఖ దర్యాప్తు చేసి జేసీ ఫ్యామిలీ కి 100 కోట్ల జరిమానా విధించడం మాత్రమే కాక ఆస్తులను కూడా జప్తు చేస్తామని నోటీసులు జారీ చేయడం తెలిసిందే.

ఇలాంటి తరుణంలో మైనింగ్ విషయంలో జేసీ భార్య జేసీ విజయ వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది.పూర్తి విషయంలోకి వెళితే 2019లో పుట్లూరు మండలంలోని యెల్లుట్ల గ్రామపరిధిలోని 2 హెక్టార్లలో బెరైటీస్ మైనింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.దానికి ప్రభుత్వం నిరాకరించడం జరిగింది.ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన జెసి భార్య విజయ ఆమె వేసిన పిటిషన్ను కొట్టేసింది.

ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అదేవిధంగా పౌరుడికి ఉంది అని తీర్పు ఇచ్చింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube