దేశచరిత్రలో నిలిచిపోయే రోజు : స్వలింగ సంపర్కం తప్పు కాదంటూ సుప్రీం సంచలన తీర్పు...ఇంతకీ ఎవరు గే..ఎవరు లెస్బియన్..

చాలా ఏళ్ల క్రితం సండే మ్యాగజీన్లో చదివిని కథ ఇప్పటికీ కళ్లముందు కదులుతుంది.అది ఇద్దరమ్మాయిల ప్రేమ,పెళ్లికి సంభందించిన విషయం.

 High Court Gives Sensational Judgement On Hijras Then Who Is Lesbian-TeluguStop.com

ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు కానీ అమ్మాయిలిద్దరి పెళ్లి ఏంటి అని.అయినా గే అని అబ్బాయిల్లో చూస్తాం.వారినే పాయింట్ ఫైవ్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటాం.కాని అమ్మాయిల్లో కూడా ఇలా ఉంటారా.తర్వాత మరికొన్ని రోజులకు మరో విషయం తెలిసి ఆశ్చర్యం.ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా లెస్బియన్ అని.తన తోటి క్రీడాకారిణితో తను డేటింగ్ చేస్తుందనేది .మ్యాచ్ గెలవగానే గ్యాలరీలో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ని ముద్దుపెట్టుకుందని.దాని ద్వారానే మార్టినా లెస్బియన్ అని అందరికి తెలిసిందనేది ఆ వార్త సారాంశం.అప్పుడు అర్ధం అయింది అమ్మాయిలను అయితే లెస్బియన్ అంటారని… ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…

భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు సెప్బెంబర్ 6.ఎందుకంటే స్వలింపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.సుప్రీం తీర్పుతో దేశ వ్యాప్తంగా LGBT కమ్యూనిటీ సంబరాలు చేసుకుంటున్నారు.

అసలు LGBT అంటే ఏమిటి? ఎవరు గే, ఎవరు లెస్బియన్, ఎవరు బైసెక్సువల్, ఎవరు ట్రాన్స్ జెండర్, వీళ్లందరికీ మధ్య ఉండే తేడాలేంటో చాలామందికి తెలీదు.ఆ వివరాలు మీకోసం.

L అంటే లెస్బియన్:

లెస్బియన్ అంటే ఒక స్త్రీకి మరో స్త్రీ పట్ల ప్రేమ కలగడం.లెస్బియన్లలో ఒకరు పురుషుల్లా ఉంటారని, జుట్టు కత్తిరించుకుని, ప్యాంటుషర్టు వేసుకుంటారని అనుకుంటారు.వాళ్లను బుచ్ అని పిలుస్తారు.ఇక రెండో పార్ట్‌ నర్‌ లో ఆడలక్షణాలు ఉంటాయని, వాళ్లు చీర కట్టుకుంటారని, వాళ్ల హావభావాలు కూడా ఆడవాళ్లలా ఉంటాయని అనుకునేవాళ్లు.

వాళ్లను ఫెమ్ అని పిలుస్తుంటారు.అయితే లెస్బియన్లలో.ఎవరి హావభావాల్లో అయినా, ఎలాంటి లక్షణమైనా కూడా ఉండొచ్చు.

G అంటే గే :

గే అంటే ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగడం.గే అనే పదాన్ని ఇప్పుడు అన్ని వర్గాలు.అంటే గే, లెస్బియన్, బైసెక్సువల్.

వీళ్లందరినీ కలిపి ఇప్పుడు గే అనే పదంతోనే పిలుస్తున్నారు.

B అంటే బైసెక్సువల్ :

బైసెక్సువల్ అంటే ఎవరికైనా, ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలగవచ్చు.ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగొచ్చు, లేదా స్త్రీపై ప్రేమ కలగొచ్చు.అలాగే ఒక స్త్రీకి మరో స్త్రీ పై లేదా మగాడిపై ప్రేమ కలగవచ్చు.

T అంటే ట్రాన్స్ జెండర్ :

ట్రాన్స్‌జెండర్ అంటే మూడో జెండర్ కి చెందిన వ్యక్తి.పుట్టినపుడు వీళ్లను మగపిల్లలో, ఆడపిల్లలో అనుకుంటారు.కానీ పెద్దయ్యాక వాళ్లు భిన్నంగా తయారవుతారు.మగాడిగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక ఆడపిల్ల లక్షణాలు బైటపడవచ్చు, ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక మగాడి లక్షణాలు కనిపించవచ్చు.ట్రాన్స్ జెండర్ల మనసులో ఉండే ఆలోచన వాళ్ల దుస్తుల రూపంలో కనిపిస్తుంది.కొంతమంది తమ ఆలోచనలతో పాటుగా శరీరం కూడా మారాలని అనుకుంటారు.

ఆపరేషన్ ద్వారా తమ శరీర అవయువాల్లో మార్పులు చేసుకుంటారు.భారతదేశంలో మాత్రం వీళ్లు ‘హిజ్రా’లు అనే పేరుతోనే అందరికీ తెలుసు.

హిజ్రా, అరావనీ, కోథీ, శివశక్తి, జోగ్తి హిజ్రా.ఇలా దేశంలో వేర్వేరు ప్రాంతాలలో వీళ్లను వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube