మంత్రి పెద్దిరెడ్డి కి కండిషన్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..!!

ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి కి హైకోర్టులో ఊరట లభించింది.మేటర్ లోకి వెళ్తే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో మంత్రి పెద్దిరెడ్డి నీ హౌస్ అరెస్ట్ చేయాలని, అంత మాత్రమే కాక మీడియాకి దూరంగా ఉంచాలని రాష్ట్ర పోలీసులకు తెలపటం జరిగింది.

 High Court Gives Green Signal To Minister Peddireddy With Conditionpeddi Reddy R-TeluguStop.com

ఈ క్రమంలో నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి కి హౌస్ అరెస్ట్ ఆదేశాలను మొన్న కోర్టు కొట్టేయడం అందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో మాట్లాడ కూడదు అని ఎస్ఈసి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో ని డివిజనల్ బెంచ్ లో ఆపిల్ చేసిన పెద్దిరెడ్డి కి కోర్టు ఊరటనిచ్చే విధంగా తీర్పు ఇచ్చింది.

మీడియాతో మాట్లాడవచ్చని తెలిపింది.

కానీ ఎన్నికల కమిషనర్ ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయకూడదని కండిషన్ పెడుతూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

వాస్తవానికి ఈ విషయంలో సింగిల్ జడ్జి బెంచ్ మీడియాతో మాట్లాడకూడదు అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది.సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులోని డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన క్రమంలో తాజాగా ఈ విధంగా తీర్పు ఇవ్వటం జరిగింది.

గతంలో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేసుకుని కీలక కామెంట్లు చేయడం జరిగింది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే మంత్రి పెద్దిరెడ్డి నీ హౌస్ అరెస్టు చేయాలని మీడియాతో మాట్లాడకూడదని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టు కి వెళ్ళటం న్యాయస్థానంలో ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube