టీ కొత్త అసెంబ్లీకి హైకోర్టు బ్రేక్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త అసెంబ్లీ భవన నిర్మాణంకు ఆది నుండి హంసపాదు అన్నట్లుగా ఉంది.మొదట పెరేడ్‌ గ్రౌండ్స్‌లో అసెంబ్లీ నిర్మాణం చేయాలనుకున్నప్పటికి అందుకు కేంద్రం ఒప్పుకోలేదు.

 High Court Give The Shcok To Telangana New Assembly-TeluguStop.com

దాంతో ఎర్రమంజిల్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో అసెంబ్లీని నిర్మించాలని నిర్ణయించారు.గత జూన్‌లో కేసీఆర్‌ కొత్త అసెంబ్లీకి శంకుస్థాపన చేయడం జరిగింది.

వచ్చే ఏడాది వరకు భవన నిర్మాణంను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భవనాలను కూల్చి వేస్తున్నారు.

పాత భవనాల కూల్చివేత విషయమై న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలు చేయడం జరిగింది.నేడు ఆ పిటీషన్‌పై కోర్టులో వాదోపవాదనలు జరిగాయి.

సుదీర్ఘంగా వాదనలు విన్న కోర్టు పిటీషనల్‌ వాదనలతో ఏకీభవించింది.ప్రజా ధనం వృదా అవుతుందనే ఉద్దేశ్యంతో కొత్త భవన నిర్మాణం అక్కర్లేదని, ప్రస్తుతం ఉన్న భవనం బాగానే ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

అందుకే కొత్త అసెంబ్లీ నిర్మాణం అక్కర్లేదు అంటూ హైకోర్టు ప్రభుత్వంకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యే తీర్పు ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube