ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హైకోర్టు బ్రేక్..!!

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 28వ తారీఖు నాడు ఖమ్మంలోని( Khammam ) లకారం చెరువులో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అంత సిద్ధం కావడం జరిగింది.మంత్రి పువ్వాడ అజయ్( Minister Puvwada Ajay ), తానా సభ్యులు.

 High Court Breaks Ntr's Idol Unveiling In Khammam , High Court, Khammam Ntr's Id-TeluguStop.com

కొందరు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు కలిసి సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అయితే కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఉండటం వల్ల అభ్యంతరాలు వ్యక్తమైన తరుణంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు దొడ్డ రవి, కర్నాటి కృష్ణ, శిల్పి ప్రతాప్ వర్మ తెలిపారు.

దీంతో కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని రాజు విగ్రహంగా మారుస్తున్నట్లు వెల్లడించారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హైకోర్టు బ్రేక్ వేయడం జరిగింది.ఎన్టీఆర్ విగ్రహం ( NTR statue )ఏర్పాటుపై హైకోర్టు స్టే కొనసాగింపు చేస్తూ.తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేయడం జరిగింది.దీంతో 100వ జయంతి నాడు మే 28వ తారీకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయాలని నిర్వాహకులు చేసిన ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసినట్లయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube