రేవంత్ కి హై కమాండ్ పిలుపు...ఓటమిపై ఆరా

తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడడానికి ప్రయత్నిస్తోన్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోన్న పరిస్థితి ఉంది.

 High Command Calls On Rewanth .  To Enquire About Defeat Revanth Reddy, Telangan-TeluguStop.com

అయితే పీసీసీ చీఫ్ లను మార్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆశించినంత   వృద్ది చెందడం లేదు.అయితే కాంగ్రెస్ ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లకపోవడానికి కారణం అంతర్గత పోరు.

రేవంత్ రెడ్డికి మిగతా కొంత మంది సీనియర్ లకు మధ్య కోల్డ్ వార్ తో ప్రజల్లో పలుచనవుతున్న పరిస్థితి ఉంది.ఇక అసలు విషయానికొస్తే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఎదుర్కొన్న మొట్ట మొదటి ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక.

ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎంతలా ఘోరంగా ఓటమి పాలైందనే విషయం మనం కొత్తగా చర్చించుకోనవసరం లేదు.అయితే హుజూరాబాద్ లో ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ లు రేవంత్ వ్యూహాన్ని, వ్యవహార శైలిని బహిరంగంగానే తప్పు పట్టిన పరిస్థితి ఉంది.

దానికి కౌంటర్ గా నేతలు విదేశాలలో ఉండి మాట్లాడితే సరిపోదు, క్షేత్ర స్థాయిలో పార్టీ కొరకు పనిచేస్తే తెలుస్తుంది అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలపై పరోక్షంగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.

Telugu @revanth_anumula, Balmuri Venkat, Congresssonia, Command, Huzurabad, Koma

తాజాగా హుజూరాబాద్ లో ఘోర ఓటమిపై సోనియా గాంధీకి కాంగ్రెస్ సీనియర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుండి పిలుపు వచ్చింది.క్షేత్ర స్థాయిలో ఘోర ఓటమికి గల కారణాలు, ఓటమి పొందడానికి ఎదురైన పరిస్థితులపై హైకమాండ్ ఆరా తీసిన పరిస్థితి ఉంది.అయితే రేవంత్ ఎటువంటి సమాధానాలు ఇచ్చారనేది బయటికి వచ్చే అవకాశం లేకున్నా హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఎంత మేరకు బలంగా ఉందనే విషయం అవగాహన ఉంటుంది కావున ఓట్ల శాతం తగ్గడంపై వివరణ అడిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube