వాట్సాప్ లో అవతలవారి స్టేటస్ చూసినా కానీ వారికి తెలియకుండా ఉండేలా చేయడం ఎలానో తెలుసా..?!  

మామూలుగా మనం వాట్సాప్ ఉపయోగిస్తున్న సమయంలో అప్పుడప్పుడు మనకు సంబంధించిన స్టేటస్ లో ఏవైనా మంచి వాఖ్యాలు , లేదా ఫోటోలు, వీడియోలు మన స్నేహితులతో పంచుకోవడానికి వాట్సాప్ స్టేటస్ లో ఉంచడం ఈ మధ్యకాలంలో కామన్ గా మారిపోయింది.అలా స్టేటస్ పెట్టాక మనం ఊరుకుంటామా.? కాస్త సమయం గడిస్తే సరి.ఎంత మంది మన స్టేటస్ చూసారా.? అంటూ స్టేటస్ కింద ఉన్న ఐకాన్ ను క్లిక్ చేసి ఎవరు చూశారో చూస్తూ ఉంటాం.అయితే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది.

TeluguStop.com - Hide Your View Other Whatsapp Status Tricks

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళితే…

కళ్లకు కనిపించేదంతా నిజం కాదన్నట్లు.ఎవరెవరు చూశారు అన్న లిస్ట్ లో కనిపించే వారి పేర్లు మాత్రమే కాకుండా ఆ లిస్టులో కనిపించని వారు కూడా మీ వాట్సాప్ స్టేటస్ ని చూసి ఉంటారన్న విషయం మీకు తెలుసా.? ఏంటి ఆ లిస్టులో లేని వారు కూడా మన స్టేటస్ ను చూస్తారా అని అనుకుంటున్నారా.? అవునండి, అది సాధ్యమే.సింపుల్ గా ఒక చిన్న ట్రిక్ పాటిస్తే సరి మీ స్టేటస్ ను అవతలి వారు చూసిన కానీ, ఆ స్టేటస్ ను వారు చూసినట్లుగా చూపించదు.ఇందుకు సంబంధించి ఇది వరకే వాట్సాప్ స్టేటస్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకు రాగా అందులో అక్షరాల రూపంలో, ఫోటోలు వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళవచ్చు.అయితే అలా స్టేటస్ పెట్టినవి కేవలం 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.24 గంటలు దాటిపోతే మీరు ఎలాంటి పక్రియ చేయకపోయినా సరే ఆటోమేటిక్ గా ఆ స్టేటస్ డిలీట్ అయిపోతుంది.

TeluguStop.com - వాట్సాప్ లో అవతలవారి స్టేటస్ చూసినా కానీ వారికి తెలియకుండా ఉండేలా చేయడం ఎలానో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే మనం వేరే వారి స్టేటస్ చూసిన కానీ మనం చూసినట్లుగా వారికి కనిపించకుండా ఉండాలి అంటే.మనందరికీ తెలిసిందే వాట్సాప్ లో బ్లూటిక్ ఆప్షన్ ఉన్న విషయం.దాన్ని ఆధారంగా చేసుకుంటే సరి, మీరు అవతలి వారి మెసేజ్ చదివినా కానీ వారికి మీరు ఆ మెసేజ్ చూడటం లేదా చదవడం లాంటివి చేసినా వారికీ తెలియదు.ఇప్పుడు కొత్తగా బ్లూటిక్ ఆప్షన్ కేవలం మెసేజ్ లకు మాత్రమే కాకుండా స్టేటస్ లో కూడా ఉపయోగపడుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

ఆ ఆప్షన్ ను మీరు ఆఫ్ చేసినట్లయితే మీరు స్టేటస్ చూసినట్లు అవతలి వ్యక్తికి కూడా తెలియదు.అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.మీ స్టేటస్ లు ఎవరెవరు చూశారా అనేది కూడా మీకు కనిపించదు.ఇందుకు మీరు ఓకే అనుకుంటేనే ఆ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

మీరు అవతల వారి స్టేటస్ చూసిన స్వామి వారి లిస్టులో మీ పేరు కనపడకుండా చేసుకోవచ్చు.ఇందుకోసం ఏమి చేయాలంటే వాట్సప్ ఓపెన్ చేసిన తర్వాత పైన కుడిచేతి వైపు ఉన్న మూడు చుక్కలని క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత అందులో అకౌంట్ ఆప్షన్ లో ఉన్న ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి.

అక్కడ రీడ్ రిసిప్ట్ ను ఆఫ్ చేస్తే సరి.

#WhatsAppSimple #Whatsapp #HowTo #ReadReceipts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hide Your View Other Whatsapp Status Tricks Related Telugu News,Photos/Pics,Images..