బానిసగా మారి సర్వం కోల్పోయా: నటుడు ప్రభు గణేశన్

సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఏదో ఒక రకంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయితే తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాగానే తమిళంలో కూడా ఎం జె ఆర్ శివాజీ గణేషన్ లాంటి వారు ఇండస్ట్రీకి రెండు కన్నులు లాంటి వారు అని చెప్పొచ్చు.

 Hidden Facts About Actor Prabhu Ganesan-TeluguStop.com

శివాజీ గణేషన్ తమిళంలో స్టార్ హీరోగా వెలుగొంది తనదైన నటనతో మంచి గుర్తింపును సాధించారు.తన కొడుకుగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ప్రభు మాత్రం హీరోగా మంచి సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు అనే చెప్పాలి.దానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రభు శివాజీ గణేషన్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 1982లో బాలీవుడ్ లో హిట్ అయిన కాళీ చరణ్ సినిమాకి రీమేక్ గా తమిళంలో సరిగిలి అనే సినిమాని చేశారు.అది మంచి విజయం సాధించడంతో వరుసగా సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు మొదట్లో ఆయన చేసిన 30 సినిమాల్లో 19 సినిమాలు వాళ్ల నాన్న అయిన శివాజీ గణేషన్ తోనే చేశారు.ఆ తర్వాత గురు శిష్యులు సినిమాలో రజనీకాంత్ తో కలిసి నటించారు.ఆ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో మణిరత్నం దర్శకత్వంలో కార్తీక్, ప్రభు ఇద్దరు హీరోలు గా ఘర్షణ సినిమా చేశారు, అది తమిళంతో పాటు తెలుగులో కూడా పెద్ద హిట్ అవడంతో ప్రభుకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.

 Hidden Facts About Actor Prabhu Ganesan-బానిసగా మారి సర్వం కోల్పోయా: నటుడు ప్రభు గణేశన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళంలో తను చేసిన చిన్న తంబి సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.ఆ సినిమాని తెలుగులో వెంకటేష్ హీరోగా చంటి పేరుతో రీమేక్ అయింది ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది.

ప్రభు సినిమాల్లో హీరోగానే కాకుండా కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేశాడు.

ప్రభు పూనీత అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు, వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అందులో ఒకరు అమ్మాయి అయిన ఐశ్వర్య ప్రభు కాగా,ఇంకొకరు విక్రమ్ ప్రభు.ప్రస్తుతం విక్రమ్ ప్రభు సినిమాల్లో హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా చేస్తున్నాడు.అయితే ప్రభు తన భార్యకి విడాకులు ఇచ్చారు.

ఐదు సంవత్సరాలపాటు ఖుష్బూతో సహజీవనాన్ని కొనసాగించారు ఆ తర్వాత కుష్బూ దర్శకుడు అయిన సుందర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు.అయితే ప్రభు విచ్చలవిడిగా పార్టీలను చేస్తూ డబ్బులు వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారని చాలామంది అనుకుంటారు.

శివాజీగణేశన్ సంపాదించిన డబ్బులను మొత్తం ఖర్చు చేశారని చాలా మంది చెబుతుంటారు.

ఒక టైంలో శివాజీ గణేషన్ సంపాదించిన డబ్బులు మొత్తం పోయి రోడ్డున పడే పరిస్థితి రావడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ జరిగిన విషయం తెలుసుకుని జాగ్రత్తగా ఉండు డబ్బులు వృధా చేయకు అని చెప్పి ప్రొడ్యూసర్ గా పెట్టి ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చంద్రముఖి సినిమా చేశాడు రజనీకాంత్.అది కూడా వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవం తో సినిమా చేస్తున్నానని చెప్పాడు.ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా డబ్బులు బాగా సంపాదించుకున్నాడు అయితే ప్రస్తుతం ఆయన చేసిన పనుల వల్ల మళ్లీ మొత్తం డబ్బులుపోయాయి అని మళ్లీ రజనీకాంత్ తో ఒక సినిమా చేయాలని అని అడిగాడట మరి దానికి రజినీకాంత్ ఒప్పుకున్నాడో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ప్రభు తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ సినిమాలో వాళ్ళ నాన్న గా నటించాడు, అలాగే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమాలో ఇలియానా తండ్రి గా నటించాడు, రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సాధించారు.సూర్య హీరోగా వచ్చిన వీడొక్కడే సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ ని పోషించి తనదైన గుర్తింపు సాధించుకున్నాడు.

#HiddenFacts #PrabhuGanesan #PrabhuGanesan #ActorPrabhu #Prabhu Ganesan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు