దుల్కర్ ఆ సినిమాని పూర్తి చేసేశాడు.. నెక్స్ట్ హను ప్రాజెక్ట్ మీదనే

కొత్త సంవత్సరంలో చాలా మంది స్టార్స్ కొత్త ప్రాజెక్ట్ లతో రెడీ అవుతున్నారు. కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ అందరి మీద ఉంది.

 Hey Sinamika Team Wraps Up Shoot, Brunda Master, Kollywood, South Cinema, Dulque-TeluguStop.com

లాక్ డౌన్ కారణంగా చాలా కాలం ఇంటిలోనే గడిచిపోయింది.ఇక అక్టోబర్ నుంచి మళ్ళీ సినిమా షూటింగ్ లు యధావిధిగా మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే సౌత్ లో స్టార్ హీరోగా అన్ని భాషలలో సినిమాలు చేస్తున్న హీరోగా దుల్కర్ సల్మాన్ గుర్తింపు తెచ్చుకున్నాడు.మలయాళీలో ప్రస్తుతం ఉన్న టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న దుల్కర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా డిఫరెంట్ జోనర్ లో కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేకుండా స్టోరీ సెలక్షన్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం ఈ కుర్ర హీరో స్టార్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకత్వంలో హే సినామికా అనే సినిమాలో నటించాడు.

ఈ సినిమా షూటింగ్ కి తాజాగా గుమ్మడికాయ కొట్టేశారు.

Telugu Brunda Master, Dulquer Salmaan, Hey Sinamika, Kajal Aggarwal, Kollywood-M

తెలుగు, తమిళ్, మలయాళీ బాషలలో ఈ సినిమాని తెరకెక్కించారు.కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.ఎన్నో సినిమాలకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన బృంద దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో దీనిపై బాగానే అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక హే సినామికా సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో ఇప్పుడు దుల్కర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మల్టీ లింగ్వల్ మూవీపై ఫోకస్ చేస్తున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కార్గిన్ వార్ నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ఇందులో దుల్కర్ సైనికుడుగా కనిపించబోతూ ఉన్నారు.ఇక దుల్కర్ ఈ సినిమాని ప్రేమకథా చిత్రంగా ఆవిష్కరిస్తున్నారు.

ఇక హే సినామికా షూటింగ్ కంప్లీట్ చేయడంతో జనవరి ఫెస్టివల్ తర్వాత హను సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube