బీసీసీఐ వేధిస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన గిబ్స్..!,

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హర్షలే గిబ్స్ తనను బీసీసీఐ వేధిస్తోందని ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.అసలు దక్షిణాఫ్రికాకు చెందిన రిటైర్డ్ ప్లేయర్ గిబ్స్ ను బీసీసీఐ ఎందుకు వేధిస్తుందని చాలా మందికి అనుమానం రాక మానదు.

 Herschelle Gibbs Allegations On Bcci Kashmir Premier League-TeluguStop.com

కానీ అతడు బీసీసీఐపై కామెంట్లు చేసింది కశ్మీర్ ప్రీమియర్ లీగ్ గురించి.ఆగస్టు 6 నుంచి ఆరంభం కానున్న కశ్మీర్ ప్రీమియర్ లీగ్ లో తనను ఆడొద్దంటూ బీసీసీఐ వేధిస్తోందని అతడు ట్విటర్ వేదికగా కామెంట్ చేశాడు.

అతడి వాదనకు ప్రస్తుతం మద్దతు పెరుగుతోంది.పలువురు పాకిస్తాన్ కు చెందిన మాజీ ప్లేయర్లు ఈ ఘటనపై స్పందిస్తున్నారు.

 Herschelle Gibbs Allegations On Bcci Kashmir Premier League-బీసీసీఐ వేధిస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన గిబ్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాళ్లు కూడా బీసీసీఐ వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు.ఒకవేళ ఆడితే గిబ్స్ ఇండియాలో జరిగే ఎటువంటి లీగ్ లలో ఆడకుండా, పాల్గొనకుండా చేస్తామని బీసీసీఐ పెద్దలు తనను హెచ్చరించారని అతడు ఆరోపించాడు.

ఇంకా దీనిపై అతడు మాట్లాడుతూ.బీసీసీఐ క్రికెట్ ను రాజకీయాలతో ముడిపెడుతూ ఉందని ఇది చాలా బాధాకరమని అన్నాడు.

ఇక పోతే బీసీసీఐ ప్రపంచంలోనే క్రికెట్ ఆడే దేశాల్లో అత్యధిక సంపన్న బోర్డు కావడం విశేషం. బీసీసీఐ ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోందని చాలా మంది ఇది వరకు కూడా కామెంట్లు చేస్తూ… ఆరోపణలు గుప్పించారు.

కాగా కశ్మీర్ ప్రీమియర్ లీగ్ లో శ్రీలంక ఆటగాడు దిల్షాన్ కూడా పాల్గొంటున్నాడు.మొత్తం ఈ లీగ్ లో ఆరు జట్లు పాల్గంటుండగా… షాషిద్ అఫ్రిదీ, కమ్రాన్ అక్మల్, షోయబ్ మాలిక్ వంటి ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

ఇలా గిబ్స్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.అయినా కానీ బీసీసీఐ పెద్దలు ఈ విషయంపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

హర్షలే గిబ్స్ తమపై చేసిన ఆరోపణలను ఖండించనూ లేదు.

#HerschelleGibbs #KashmirPremier #HerschelleGibbs #BCCI

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు