ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కు బాలయ్య బంపర్ ఆఫర్..! ఇంతకీ ఆ అమ్మాయిని గుర్తుపట్టారా..?     2018-10-29   08:30:05  IST  Sai Mallula

టీవీ షోస్ లో మిమిక్రి చేస్తూ, లాగ్‌ పంచులతో ఆకట్టుకునే కోమలి సిస్టర్స్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు అనుకుంట. చిన్న వయసులోనే ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు ఈ సిస్టర్స్. కోమలి సిస్టర్స్‌లో పెద్ద కోమలి అదేనండి. హిరోషిని కోమలి ఇప్పుడు సినిమా హీరోయిన్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తన పేరు హిరోషినిలోని హీరోతో పాటు తాను కూడా ఇన్‌ అంటూ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతోంది.

Heroshini Komali As Uma Maheshwari In NTR Biopic-

Heroshini Komali As Uma Maheshwari In NTR Biopic

ఆ సిస్టర్స్ పుట్టింది ఖమ్మంలో అయినప్పటికీ హైదరాబాద్ లోనే పెరిగారు. కోమలి హిరోషిని, కోమలి దేవర్షిని. ఇద్దరు కోమలి సిస్టర్స్‌గా అందరికీ సుపరిచితమే. టీవీ షోల్లో ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం పెద్ద కోమలి యూసుఫ్‌గూడ సెయింట్‌ మెరీస్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌ జర్నలిజం ఫైనలియర్‌ చదువుతున్నారు.

Heroshini Komali As Uma Maheshwari In NTR Biopic-

“కొత్త హిరోషిని కోమలిగా దగ్గర కావాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా మిమిక్రీలాంటి షోలకు దూరంగా ఉన్నాను. చివరగా త్రివిక్రమ్‌ చిత్రం ‘అ ఆ’ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేశాను. థియేటర్‌ వర్క్‌షాప్‌లో సత్యానంద్‌ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నాను. కొద్దిపాటి ప్రతిభ, అనుభవం ఉన్నా… డ్యాన్సర్‌గా, ఆర్టిస్ట్‌గా అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని వెండితెరకు రావాలన్నదే నా ఆలోచన. ప్రేక్షకులు కొంగొత్తగా హిరోషిని కోమలిని చూడాలని జిమ్, ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నా. కునాల్‌ గిర్‌ స్టీల్‌ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్నాను. గ్లామర్ పాత్రల కన్నా చాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలని ఉంది.” అని ఇటీవలే ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు.

Heroshini Komali As Uma Maheshwari In NTR Biopic-

కాగా ఇంత‌టి క‌ష్ట‌ప‌డే అమ్మాయికి మంచి అవ‌కాశాన్ని క‌ల్పించారు నంద‌మూరి బాల‌క్రుష్ణ‌.. ఇక తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ డాటర్ పాత్రకు ఎంపిక‌చేసుకున్నారు. దీంతో కోమ‌లి కుటుంభ సభ్యుల ఆనందానికి అవ‌దులులేకుండా పోయాయి. బాలకృష్ణ, విద్యాబాలన్ వంటి హేమాహేమీలతో కల్సి నటిస్తున్న హీరోష్ని కోమలి కి ఎన్టీఆర్ బయోపిక్ పునాది అవుతుందని, భవిష్యత్తులో హీరోయిన్ గా రాణిస్తుందని త‌న త‌ల్లితండ్రులు అంటున్నారు. సో మీరు కూడా ఆల్ ద‌బెస్ట్ చెప్పేయండి..!!