ఎంత బాగా డ్యాన్స్ చేయడం వస్తే అంత మంచి హీరోయిన్లు అనే పేరుంది సినిమా ఇండస్ట్రీలో.డ్యాన్స్ రాని వారు కూడా టాప్ హీరోయిన్లుగా కొనసాగారు.
అయితే డ్యాన్స్ అనేది హీరోయిన్లకు అదనపు అసెట్.అనుష్క డ్యాన్సులను బాగా చేయలేకపోయినా.
టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ప్రియమణి అద్భుతంగా డ్యాన్సులు చేయగలిగినా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.
అలాగే పలువురు కొరియోగ్రాఫర్లుగా కెరీర్ మొదలు పెట్టిన భామలు.ఆ తర్వాత హీరోయిన్లుగా మారి అదరగొట్టారు.ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
గాయత్రీ రఘురామ్
గాయత్రీ రఘురామ్.ఫేమస్ కొరియోగ్రాపర్ రఘురామ్ కుమార్తె.తన తండ్రి నుంచి వారసత్వంగా కొరియోగ్రాఫర్ గా మారింది.పలు సినిమాలకు కొరియోగ్రఫీ అందించింది కూడా.ఆ తర్వాత గాయత్రి హీరోయిన్ గా చేసింది.
మా బాపు బొమ్మకి పెళ్లంట సినిమాలో నటించింది.లవ్ ఫెయిల్యూర్ మూవీలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.
రంగ్ దే మూవీలో కీరోల్ ప్లే చేసింది.ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి వెళ్లడం మూలంగా సినిమాలు చేయడం లేదు.
సీరత్ కపూర్

సీరత్ మంచి డ్యాన్సర్.ఇప్పటికే పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేసింది.కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా తెరకెక్కించింది.ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.తెలుగులో రన్ రాజా రన్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.చక్కటి హిట్ కొట్టింది.ఈ సినిమాలో అద్భుతమైన డ్యాన్సులతో అదరగొట్టింది కూడా.
ఫర్జానా

సీమశాస్త్రి సినిమాలో హీరోయిన్ గా చేసింది ఫర్జానా.అనంతరం భాగ్యలక్ష్మి బంపర్ డ్రా సినిమాలోనూ నటించింది.అంతకు ముందు పలు బాలీవుడ్ సినిమాలకు ఆమె కొరియోగ్రఫీ అందించింది.
అటు తను నటించిన సినిమాల్లో కూడా కొన్ని పాటలకు తనే డ్యాన్స్ కంపోజ్ చేసుకుందట.

అటు ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ శోభన కూడా సినిమాల్లో రాణించింది.తన సినిమాలకు ఆమె సొంతంగా కొరియోగ్రఫీ చేసుకుంది.భానుప్రియ, సాయిపల్లవి కూడా మంచి డ్యాన్సర్లే కావడం విశేషం.