ప్రయోగాలకు సై అంటున్న హీరోయిన్స్.. హిట్టైతే రేంజ్ వేరు?

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు అవకాశాల కోసం పొట్టి దుస్తులను ధరిస్తూ ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.ఇలా ఎన్నో సినిమాలలో గ్లామరస్ పాత్రలో నటించిన కొందరు ముద్దుగుమ్మలు సరికొత్త ప్రయోగాలకు సై అంటూ విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుని వంటినిండా దుస్తులు ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ సరికొత్త ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యారు.

 Heroines Who Are Preferring Mythical Characters Over Glamorous Roles, Samantha,-TeluguStop.com

ఇప్పటికే ఈ విధమైనటువంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కంగనా, దీపిక వంటి స్టార్ సెలబ్రెటీలు ఉన్నారని చెప్పవచ్చు.ఈ కోవలోకే సమంత కృతిసనన్ చేరిపోయారు.

తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా ద్వారా సమంత సరికొత్త ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నారని చెప్పవచ్చు.శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో సమంత శకుంతల పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలో నటించి అందరిని మెప్పించిన ఈ ముద్దుగుమ్మ మరి ఈ పాత్ర ద్వారా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Telugu Adipurush, Deepikadroupadi, Kanganaindira, Kangana Ranaut, Kriti Sanon, K

రామాయణ కథలో సీత పాత్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే.సీత పాత్రలో నటించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఇప్పటికే సీత పాత్రలో నటించిన నయనతార మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ క్రమంలోనే మరోసారి సీత పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యింది కృతిసనన్.రామాయణం కథ ఆధారంగా బాలీవుడ్లో దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో కృతిసనన్ సీత పాత్రలో నటించనున్నారు.

ఈ పాత్రలో చేయటం కోసం కృతిసనన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.

Telugu Adipurush, Deepikadroupadi, Kanganaindira, Kangana Ranaut, Kriti Sanon, K

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడే కంగనా ఇదివరకు ఝాన్సీ లక్ష్మీబాయి, జయలలిత వంటి బయోపిక్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా ఈమె ఇందిరా గాంధీ బయోపిక్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక సొట్ట బుగ్గల చిన్నది దీపికా పదుకొనే కూడా పద్మావతి చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు.

ఈ క్రమంలోనే ఈమె మరోసారి ద్రౌపది పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సరికొత్త పాత్రలలో నటిస్తూ ఈ ముద్దు గుమ్మలు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube