ప్రేమించిన వారి చావుతో హంతకులు గా ముద్ర పడ్డ హీరోయిన్స్ వీళ్ళే !

ప్రేమలు, పెళ్లిళ్లు సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం.అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఈ కొంతమంది హీరోయిన్స్ తమ జీవితాల్లో పెద్ద అలజడులని ఎదుర్కొన్నారు.

 Heroines Who Are Faced Police Cases Rhea Chakraborthy Rekha Pavani Details, Hero-TeluguStop.com

ఎంతో ప్రేమతో పెళ్ళాడిన వ్యక్తిని కోల్పోవడమే కాదు, వారి మరణాలకు తామే కారణం అన్న అపవాదుల సైతం ఎదుర్కొన్నారు సదరు హీరోయిన్స్.మరి అలా భర్తలను కోల్పోయి, ప్రేమించిన వారిని కోల్పోయి మర్డర్ కేసును ఎదుర్కొన్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

సుశాంత్ – రియా చక్రవర్తి

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ లాక్డౌన్ సమయంలో ఆత్మహత్య చేసుకుని ఈ కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే సుశాంత్ రియా చక్రవర్తి అనే హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.అసలు కారణమేంటో తెలియదు గాని ఈ సుశాంత్ తన ఫ్లాట్ లో తానే ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే కొంతమంది సుశాంత్ చావుకి నెపోటిసం కారణం అంటూ కామెంట్స్ చేస్తే మరి కొంతమంది అతడి గర్ల్ ఫ్రెండ్ అతని డబ్బు కోసమే చంపేసింది అంటూ ప్రచారం చేశారు.అంతే కాదు లీగల్ గా ఫైట్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

సుశాంత్ కుటుంబం రియా పై కేసులు పెట్టడంతో ఆమె ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతోంది.

రేఖా – ముఖేష్

బాలివుడ్ హీరోయిన్ రేఖ సైతం తన భర్త చావుకు కారణం ఆమె అంటూ అపవాదును ఎదుర్కొన్నారు.తొలుత రేఖ అమితాబచ్చన్ తో ఎన్నో ఏళ్లపాటు ప్రేమాయణం సాగించింది.సినిమాల్లో నటిస్తూనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

కానీ అమితాబచ్చన్ జయా బచ్చన్ ని పెళ్లి చేసుకోగా రేఖ కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉంది ఆ తర్వాత ముఖేష్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది.ఏమైందో ఏమో తెలియదు కానీ ఏడాది తిరక్క ముందే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు దానికి కారణం రేఖ అంటూ మీడియా సైతం దుమ్మెత్తి పోసింది.

పావని – ప్రదీప్

బుల్లితెర హీరోయిన్ అయిన పావని తనను తోటి నటుడైన ప్రదీప్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కొన్నాళ్లపాటు వీరు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు కానీ ప్రదీప్ ఆ విషయంలో చేసిన తప్పుతో పావని దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.ఇంట్లో చిన్న చిన్న గొడవల కారణంగా ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రతి ఒక్కరూ అతడి ఆత్మహత్యకు కారణం పావని అంటూ కామెంట్స్ చేయడంతో ఆమె తెలుగు సీరియల్స్ నుంచి తప్పుకొని తమిళనాడుకు వెళ్లిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube