సినిమా హిట్ అయినా పత్తా లేకుండా పోయిన ఈ హీరోయిన్లు ఏం చేస్తున్నారంటే…  

Shraddha srinath, Divyansha kaushik, Tollywood actress, movie offers news, Tollywood - Telugu Divyansha Kaushik, Movie Offers News, Shraddha Srinath, Tollywood, Tollywood Actress

తెలుగులో సినీ పరిశ్రమకు వచ్చి రావడంతోనే తమ మొదటి చిత్రాలతో హిట్ ఇచ్చి ఇలా తళుక్కున మెరిసి అలా తెరమరుగైపోయిన తెలుగు హీరోయిన్లు ఎందరో ఉన్నారు.అయితే ఇందులో కొంతమందికి తాము నటించిన చిత్రాలు హిట్ అయినప్పటికీ తమ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, లేదా ఆ చిత్రంలో స్టార్ హీరో లేదా హీరోయిన్ పాత్ర వల్ల సినిమా హిట్ అవ్వడం వల్ల గుర్తింపు రాకపోవడం వంటి కారణాలతో సినీ పరిశ్రమకు దూరం అవుతుంటారు.

 Heroines Shraddha Srinath And Divyansha Kaushik

అయితే తాజాగా టాలీవుడ్ కి చెందిన ఇద్దరి హీరోయిన్ల గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో మొదటగా  టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన  “జెర్సీ” చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇతర వ్యాపారాలపై దృష్టి సారించినట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

సినిమా హిట్ అయినా పత్తా లేకుండా పోయిన ఈ హీరోయిన్లు ఏం చేస్తున్నారంటే…-Latest News-Telugu Tollywood Photo Image

దీనికి తోడు ఇటీవలే ఈ అమ్మడు రెస్టారెంట్ కి సంబంధించిన వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది.అందువల్లే కొందరు నెటిజన్లుశ్రద్ధా శ్రీనాథ్ తొందర్లోనే సినిమాలకి గుడ్  బై చెప్పే యోచనలో ఉందని చర్చించుకుంటున్నారు.

మరి ఇలాంటి వార్తలపై శ్రద్ధా శ్రీనాథ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వం వహించిన “మజిలీ” చిత్రంలో  ఫ్లాష్ బ్యాక్  సన్నివేశాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది.

 ఈ అమ్మడు కూడా వచ్చి రావడంతోనే ఫర్వాలేదని ఇచ్చినప్పటికీ తెలుగులో సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో కొంతమేర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంటి వద్ద ఖాలీగా గడుపుతున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroines Shraddha Srinath And Divyansha Kaushik Related Telugu News,Photos/Pics,Images..